Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభDragon: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' మూవీ రెండు భాగాలుగా!

Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీ రెండు భాగాలుగా!

NTR-Neel: పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్, మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ పై ఇండస్ట్రీలో భారీ హైప్ నెలకొనగా, తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాను మేకర్స్ ఏకంగా రెండు భాగాలుగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. నీల్ సినిమాలకు కథ పరిధి చాలా పెద్దగా ఉండటం, క్యారెక్టర్ ఎలివేషన్స్ కోసం ఎక్కువ సమయం తీసుకోవడం వలన, ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ లో టాక్ నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం మైత్రీ మూవీ మేకర్స్ సుమారు ₹500 కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయించినట్లు సమాచారం.

- Advertisement -

ALSO READ: Pradeep Ranganadhan: ‘డ్యూడ్’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!

సాధారణంగా రెండు పార్ట్‌లుగా వచ్చే సినిమాల మధ్య కనీసం ఒక ఏడాది గ్యాప్ ఉంటుంది. కానీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఊరటనిచ్చేలా.. మేకర్స్ ఒక సాలిడ్ ప్లాన్ అమలు చేయనున్నారనే వార్త బలంగా వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో మొదటి భాగం విడుదలైన తర్వాత, రెండో భాగం కోసం ప్రేక్షకులు ఎక్కువ కాలం ఎదురుచూడకుండా, కేవలం కొన్ని నెలల గ్యాప్ లోనే విడుదల చేసేలా ప్రశాంత్ నీల్ టీమ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ స్ట్రాటజీ ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద ఒక సంచలనం సృష్టించే అవకాశం ఉంది. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్, నీల్ విజువల్స్ కలిసి.. ఈ డ్రాగన్ సినిమాతో టాలీవుడ్ రికార్డులను తిరగరాయడం పక్క అని మాత్రం అర్ధం అవుతుంది. త్వరలోనే ఈ రెండు భాగాల విడుదల గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ALSO READ: Janhvi Kapoor: పల్లెటూరి గెటప్స్‌లో జాన్వీ కపూర్ లుక్స్‌పై కామెంట్లు!

ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా పూర్తి చేసుకున్న వెంటనే, దర్శకుడు కొరటాల శివతో కలిసి ‘దేవర 2’ ను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టును కూడా త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇలా ‘డ్రాగన్’ రెండు భాగాలు, ‘దేవర 2’, త్రివిక్రమ్ కాంబో.. వంటి సాలిడ్ ప్రాజెక్టులతో ఎన్టీఆర్ లైనప్.. టాలీవుడ్ లోనే అత్యంత క్రేజీయెస్ట్ లైనప్‌గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad