Saturday, November 15, 2025
HomeTop StoriesKantara Chapter 1: కాంతార 2 ప్రీ రిలీజ్ ఎప్పుడు, ఎక్కడ ?

Kantara Chapter 1: కాంతార 2 ప్రీ రిలీజ్ ఎప్పుడు, ఎక్కడ ?

Kantara LATEST UPDATE : కాంతార ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు అసలు మర్చిపోలేరు. మొదట్లో “కన్నడ హీరో రిషబ్ శెట్టి ఈ సినిమాకు హీరో కూడా, డైరెక్టర్ కూడా” అన్న సమాచారం మాత్రమే తెలుగువాళ్లకు తెలిసింది. తర్వాత ట్రైలర్ విడుదల కావడంతో ఇది హారర్ జానర్ సినిమా కావచ్చని అనుకున్నారు. కానీ థియేటర్లలో సినిమా విడుదలైన తర్వాతే అసలు విషయం తెలిసింది. సినిమాలో ఉన్న అద్భుతమైన భక్తి తత్త్వం (డివోషనల్ కంటెంట్) ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.

- Advertisement -

కేవలం 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 350 కోట్లకు పైగా వసూలు చేసి సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్‌గా కాంతార 2 రాబోతోంది. ఈసారి మాత్రం బడ్జెట్ 125 కోట్లు. దీంతో విజువల్స్ ఏ స్థాయిలో ఉంటాయో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిలీజ్ అయిన ట్రైలర్‌తో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి.

ఇక ఇప్పుడు కాంతార 2 లో, ప్రెసెంట్ ట్రెండ్ లో కొనసాగుతున్న రుక్మిణి వసంత హీరోహిన్ గా నటిస్తుండగా, ఈ సినిమా ని తెలుగు హిందీ మలయాళ కన్నడ భాషలతో పాటుగా ఇంగ్లీష్ లో కూడా ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.
మరి దక్షిణ అమెరికా లో కాంతార చాప్టర్ 1 కి దక్కిన రెస్పాన్స్ అలాంటిది మరి.అందుకే స్పానిష్ లో కూడా సినిమాని డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/mohan-babu-first-look-unveiled-from-nani-paradise-movie/

NTR: ఈ హైప్‌కి మరింత ఊపు తెచ్చేందుకు “మాన్ ఆఫ్ మాసెస్” ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా కాంతారా 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రాబోతున్నారు. ఇటీవల యాడ్ షూట్‌లో గాయపడిన ఎన్టీఆర్ హాస్పిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. అందువల్ల ఆయన వస్తారా లేదా అన్న అనుమానాలు ఉండగా, మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది – ఎన్టీఆర్ తప్పకుండా వస్తారని.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/little-hearts-movie-ott-streaming-on-august-1st/

HYDERABAD:సెప్టెంబర్ 28న హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్‌లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. అక్టోబర్ 2న విడుదల కాబోయే కాంతార 2 ఎంతటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎన్టీఆర్ గెస్ట్‌గా రావడం వలన సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోతాయని చెప్పాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad