Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభJr NTR: అమెరికా కాన్సులేట్‌లో ఎన్టీఆర్.. ‘డ్రాగన్’ షూటింగ్ కోసం సిద్ధం!

Jr NTR: అమెరికా కాన్సులేట్‌లో ఎన్టీఆర్.. ‘డ్రాగన్’ షూటింగ్ కోసం సిద్ధం!

Jr NTR: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ను సందర్శించారు. అమెరికాలో తన రాబోయే చిత్రం ‘డ్రాగన్’ షూటింగ్ కోసం వీసా ప్రక్రియలో భాగంగా ఆయన అక్కడకు వెళ్లారు. ఈ సందర్భంగా అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ స్వయంగా ఎన్టీఆర్‌ను స్వాగతించి, ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

- Advertisement -

ఈ ఫోటోలో ఎన్టీఆర్ చాలా సన్నగా, స్టైలిష్‌గా కనిపించారు. ఆయన కొత్త లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. దీనికి కారణం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డ్రాగన్’ సినిమా. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం ఎన్టీఆర్ తీవ్రంగా బరువు తగ్గారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అమెరికాలోని వివిధ ప్రదేశాల్లో చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా వీసా తీసుకునేందుకు ఎన్టీఆర్ కాన్సులేట్‌ను సందర్శించారు.

అమెరికాలో భారతీయ సినిమాల చిత్రీకరణ పెరగడం, ముఖ్యంగా తెలుగు సినిమాలు అక్కడ షూటింగ్ చేయడం వల్ల ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత బలపడతాయని లారా విలియమ్స్ పేర్కొన్నారు. ఇటీవల ‘వార్ 2’ సినిమాలో తన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్, ‘డ్రాగన్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం భారతీయ సినిమాకు కొత్త హద్దులు సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad