Ram Pothineni Latest Movie Update: పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఎనర్జిటిక్ హీరోగా పాపులర్ అయిన రామ్ పోతినేని, ఉస్తాద్ గా క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆ సినిమా తర్వాత వచ్చినవన్నీ ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. టాలీవుడ్ యంగ్ హీరోలలో రామ్ పోతినేని ఇంకా పాన్ ఇండియా వైడ్‌గా మార్కెట్ పెంచుకోవాల్సి ఉంది. ఇక రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ పి. మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతోంది ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ (Andhra King Taluka). బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్.. అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
రామ్ జంటగా ఈ సినిమాలో మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సె (Bhagyashri Borse) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. వివేక్ అండ్ మెర్విన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. అయితే.. ఇన్ని రోజులు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్స్ రావడం లేదని అభిమానులు కాస్త నిరాశపడ్డారు. వీరికోసం తాజాగా, ఓ మెలోడి సాంగ్ రిలీజై యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. కోలీవుడ్ మ్యూజిక్ సెన్షేషన్ అయిన అనిరుధ్ రవిచందర్ ఈ పాటను పాడటం ఓ స్పెషాలిటీ.
Also Read – HHVM Ticket Rates: ఏపీలో పెరిగిన ‘హరిహర వీరమల్లు’ టికెట్ రేట్స్
ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా నుంచి ఇప్పటివరకూ పోస్టర్స్, గ్లింప్స్ వచ్చి ఆకట్టుకోగా, ఇప్పుడు “నువ్వుంటే చాలే” అంటూ సాగే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తోంది. రామ్, భాగ్య శ్రీ జంట చాలా చక్కగా కనిపిస్తున్నారు. తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ వాయిస్ ఈ పాటని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్ళిందని మ్యూజిక్ లవర్స్ అంటున్నారు. మన ఉస్తాద్ హీరోకి సాంగ్ లో ఎంత ఎనర్జీ ఉంటే అంతకు డబుల్ ఎనర్జీతో స్టెప్పులేసి థియేటర్స్‌లో అభిమానులను ఉర్రూతలూగిస్తారు.
ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా కంప్లీట్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర (Upendra) ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయనకి అభిమానిగా రామ్ కనిపించబోతున్నారు. ఈ సినిమా సక్సెస్ విషయంలో రామ్ తో పాటు ఆయన అభిమానులు కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. కాగా, తాజాగా వచ్చిన ఈ ఫస్ట్ సాంగ్ వింటే సినిమాపై అంచనాలు ఇంకా పెరగడం పక్కా అని తెలుస్తోంది. అతి త్వరలో మేకర్స్ ఆంధ్రా కింగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. రామ్, భాగ్య శ్రీ కెమిస్ట్రీ.. అలాగే, సంగీత ద్వయం వివేక్, మెర్విన్ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ అవుతుందని చెప్పుకుంటున్నారు.


