OG Concert Pawan Kalyan: హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన ‘దే కాల్ హిమ్ ఓజీ’ కన్సర్ట్ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కత్తితో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. కత్తి తిప్పుతూ ఫ్యాన్స్‌కు అభివాదం చేయడంతో.. స్టేడియంలో అభిమానుల హంగామా అదిరిపోయింది. వర్షంలో కూడా భారీ సంఖ్యలో ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ కాగా.. తమన్ సంగీతం అందించారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాలతో ఓజీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సభా వేదికపై అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/hyderabad-og-movie-pre-release-traffic-advisory-2025/
‘రాజకీయాల్లోకి వెళ్లినా మీరు నన్ను వదల్లేదు. నేను ఇలా పోరాటం చేస్తున్నానంటే దానికి కారణం అభిమానులే. సినిమా షూటింగ్ సమయంలో సుజీత్ నాకు జపనీస్ నేర్పించాడు. ఇలాంటి డైరెక్షన్ టీమ్ నేను జానీ సినిమా తీసేటప్పుడు ఉంటే నేను రాజకీయాల్లోకి వచ్చి ఉండేవాడిని కాదు. సుజీత్ చెప్పేది తక్కువ. కానీ తెరపై అతని ప్రతిభ మామూలుగా ఉండదు. ఈ మూవీ చేసేటప్పుడు నేను డిప్యూటీ సీఎం అనే సంగతి మరిచిపోయా. సుజీత్ విజన్‌కు తమన్ సంగీతం తోడవడంతో అద్భుతంగా తెరకెక్కింది. ఈ సినిమాను ఇంతగా ప్రేమిస్తానని అనుకోలేదు. ‘ఖుషీ’ సినిమా టైంలో ఖటానాను ప్రాక్టీస్ చేశారు. దాని చుట్టూ కథ అల్లి మూవీని అద్భుతంగా తీశారు.’ అని పవన్ అన్నారు.


