OG Satellite Rights: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల నటించిన పాన్ ఇండియా సినిమా ‘హరిహర వీరమల్లు’. ఈ మూవీ థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకుంది. ఇక, ఇప్పుడు అటు పవన్ ఫ్యాన్స్ ఇటు ప్రేక్షకుల అందరి దృష్టి హెవీ యాక్షన్ మూవీ ‘ఓజీ’ మీదే ఉంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. పలు కారణాల వల్ల షూటింగ్ కంప్లీట్ కాలేదు. దాంతో రిలీజ్ కూడా చాలాసార్లు పోస్ట్ పోన్ అయింది. ప్రస్తుతం ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుస్తున్నారు. అంతేకాదు, ఓజీ కూడా రెండు పార్ట్ లుగా రాబోతుందని ఈ మధ్య వార్తలు వినిపించాయి.
ఓజీ రెండు భాగాలంటే అందరికీ ఎగ్జైటింగ్ గానే ఉంది. ఇక తాజాగా ఈ సినిమా హిందీ శాటిలైట్స్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్టుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఓజీ’ ఇప్పటికే అందరిలోనూ సాలిడ్‌గా హైప్ ని క్రియేట్ చేసింది. దీనికి కారణం మేకింగ్ పిక్చర్స్, సాంగ్.. అలాగే నిర్మాత బండ్ల గణేశ్ ఇచ్చిన స్టేట్‌మెంట్. ఈ మూవీకి దర్శకుడు సుజీత్. ఆయన మేకింగ్ ఎంతో స్టైలిష్ గా ఉంటుంది.
ఓజీ లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ మూవీపై ఏర్పడిన హైప్ కారణంగా భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఓజీ సినిమాకు హిందీలో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. దీంతో హిందీ శాటిలైట్ రైట్స్ కోసం భారీగా పోటీ నెలకొందని అంటున్నారు. పాపులర్ హిందీ ఛానెల్ స్టార్ గోల్డ్ టీవీ వారు భారీ ధరకు కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ మీడియాలో న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. ఇప్పటి వరకు పవన్ సినిమాకి ఈ రేంజ్ బిజినెస్ హిందీలో జరగలేదంటున్నారు.
కాగా, ఓజీ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. వాస్తవానికి.. ఈ సినిమాకి పోటీగా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 రిలీజ్ కావాల్సింది. కానీ, సీజీ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఓజీకి వసూళ్ల పరంగా మరింతగా కలిసి వచ్చే అంశం. ఇక పవన్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా కూడా రాబోతుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్స్.


