OG Movie: ఓజీతో కెరీర్‌లోనే అతి పెద్ద విజయాన్ని అందుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ గ్యాంగ్‌స్టర్ మూవీకి సుజీత్ దర్శకత్వం వహించారు. రిలీజై ఆరు రోజులు అయినా ఇప్పటికీ థియేటర్లలో ఈ మూవీ ప్రభంజనం కొనసాగుతోంది. ఆరు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా ఓజీ మూవీ 250 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నది. మంగళవారం నాటితో ఈ మైలురాయిని చేరుకుంది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఈ ఘనతను సాధించిన ఒకే ఒక మూవీగా ఓజీ నిలిచింది.
పది కోట్లు…
మంగళవారం వరల్డ్ వైడ్‌గా ఓజీ మూవీ పది కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆరున్నర కోట్ల వరకు వసూళ్లు రాగా… ఓవర్‌సీస్‌లో మూడు నుంచి మూడున్నర కోట్ల వరకు పవన్ కళ్యాణ్ మూవీ వసూళ్లను దక్కించుకున్నట్లు చెబుతున్నారు. ఆరు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 160 కోట్ల వరకు ఓజీ మూవీకి కలెక్షన్స్ రాగా… ఓవర్‌సీస్‌లో అదరగొట్టిన ఈ మూవీ 90 కోట్ల వరకు వసూళ్లను సొంతం చేసుకున్నది.
దసరాకు…
దసరాకు కూడా థియేటర్లలో ఓజీ హవానే కనిపించబోతుంది. స్టార్ హీరోల సినిమాలతో పాటు స్ట్రెయిట్ తెలుగు మూవీస్ దసరా బరిలో లేకపోవడం ఓజీకి కలిసిరానుంది. ఐదు వందల కోట్లకు మైలురాయిని చేరుకోవడానికి ఓజీకి మంచి ఛాన్సే ఉంది. అయితే థియేటర్లలో రిలీజై ఆరు రోజులు అయినా ఓజీ మూవీ ఇంకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ మాత్రం రీచ్ కాలేదు. ఇప్పటి వరకు 90 శాతం వరకు మాత్రమే రికవరీ సాధించింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు ఇంకో పదహారు కోట్ల దూరంలో ఉంది. ఈ వీకెండ్ లోపు ఓజీ మూవీ లాభాల్లోకి అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది.
సక్సెస్ సెలబ్రేషన్స్…
కాగా ఓజీ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ వేడుకను బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు సినిమా యూనిట్ మొత్తం పాల్గొనబోతున్నారు. ఈ సక్సెస్ మీట్‌లో ఓజీ 2 ఎప్పుడు మొదలుకానుందన్నది క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఓజీ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించింది.
Also Read- Malavika Mohanan: ట్రెడిషనల్, వెస్ట్రన్ లుక్‌లో ‘ది రాజాసాబ్’ బ్యూటీ
ఓజీ తర్వాత పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర షూటింగ్ పూర్తయ్యింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ మూవీ డిసెంబర్‌లో రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.


