OG movie : పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఆయన పుట్టినరోజు సందర్భంగా అద్భుతమైన గిఫ్ట్‌తో ఆకట్టుకున్నారు. పవన్ నటిస్తున్న ‘ఓజీ’ సినిమా తొలి టికెట్‌ను ఆన్‌లైన్ వేలంలో రూ. 5 లక్షలకు కొనుగోలు చేసి రికార్డు సృష్టించారు. ఈ టికెట్‌ను అమెరికాలోని ‘టీమ్ పవన్ కల్యాణ్ నార్త్ అమెరికా’ అభిమాన సంఘం దక్కించుకుంది. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించడం విశేషం. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ALSO READ: Tollywood: మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలుసా?
పవన్ బర్త్‌డేకు ఒక రోజు ముందు ‘ఎక్స్ స్పేసెస్’ వేదికగా నిర్వహించిన ఈ వేలంలో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. టికెట్ ధర అంతకంతకూ పెరుగుతూ, చివరకు రూ. 5 లక్షల వద్ద నిలిచింది. ఈ సంఘటన పవన్‌పై అభిమానుల అమితమైన ప్రేమను చాటింది.
‘ఓజీ’ చిత్రబృందం పవన్ పుట్టినరోజున వరుస అప్‌డేట్‌లతో అభిమానులను అలరించింది. పవన్ కొత్త పోస్టర్, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ పాత్రకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఈ నెల 19న ట్రైలర్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 25న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతమైన స్పందన పొందుతున్నాయి. పవన్ కల్యాణ్ యాక్షన్ అవతార్, థమన్ సంగీతం, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయి. అభిమానుల ఈ గిఫ్ట్, సినిమా హైప్‌ను మరింత పెంచింది.


