Saturday, November 15, 2025
HomeTop Stories'OG' స్పెషల్ షో : మెగా గెలాక్సీ అంతా ఒక్కచోట. అభిమానులకు కన్నుల పండుగ!

‘OG’ స్పెషల్ షో : మెగా గెలాక్సీ అంతా ఒక్కచోట. అభిమానులకు కన్నుల పండుగ!

OG SPECIAL SHOW: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారి లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ సంచలనం ‘ఓజీ’ (OG) బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ దూసుకుపోతోంది! ఈ మెగా విక్టరీని ఘనంగా సెలబ్రేట్ చేసుకునేందుకు, నిన్న (సోమవారం) సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో మెగా కుటుంబం అంతా ఒక్కటైంది. ఇదొక సాధారణ సినిమా షో కాదు. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి తమ ‘పవర్’ను చాటుకున్న ఒక పండగ వాతావరణం!

- Advertisement -

చిరు-పవన్-చరణ్ కాంబినేషన్ అదుర్స్!

ఈ స్పెషల్ స్క్రీనింగ్‌కు మెగాస్టార్ చిరంజీవి గారు తన అర్ధాంగి సురేఖతో సహా హాజరై, తమ్ముడికి తన ప్రేమను, ఆశీస్సులను అందించారు. వారితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యువ వారసులు వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా పవన్ కల్యాణ్ గారితో కలిసి ‘OG’ సినిమాను వీక్షించారు. ముఖ్యంగా, పవన్ కుమారుడు అకీరా నందన్ కుమార్తె ఆద్య కూడా తండ్రి సినిమాను కుటుంబ సభ్యుల మధ్య చూడటం ఈ కార్యక్రమానికే హైలైట్! ఒకే ఫ్రేమ్‌లో ఇంతమంది మెగా హీరోలు, కుటుంబ సభ్యులు కనిపించడం అనేది అభిమానులకు డబుల్ ధమాకా అనే చెప్పాలి.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/raja-saab-trailer-release/

సుజీత్ విజన్‌కు స్టాండింగ్ ఒవేషన్!

సినిమా పూర్తయిన వెంటనే, థియేటర్ అంతా విజిల్స్, చప్పట్లతో దద్దరిల్లింది. మెగాస్టార్ చిరంజీవి గారు వెంటనే డైరెక్టర్ సుజీత్ విజన్‌ను, టేకింగ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే, తమన్ అందించిన బీజీఎం (BGM) సినిమాకు ప్రాణం పోసిందని కొనియాడారు. రామ్ చరణ్ కూడా ‘OG’ మేకింగ్ క్వాలిటీపై ప్రశంసల వర్షం కురిపించారు.ఈ సెలబ్రేషన్‌లో ప్రముఖ నటులు అడివి శేష్, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ వంటి సినీ ప్రముఖులు కూడా పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (OG) ఓజస్ గంభీర… ఈ పేరు ఇప్పుడు బాక్సాఫీస్ లెక్కలనే మార్చేసింది! పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారి స్టైల్, సుజీత్ విజన్ కలగలిసి థియేటర్లలో అగ్గి రాజేయగా… ‘ఓజీ’ కలెక్షన్లు ఊహకు అందని రీతిలో దూసుకుపోతున్నాయి.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/the-next-big-project-in-rajamoulis-universe/

పవన్ కల్యాణ్ బిగ్గెస్ట్ హిట్: కేవలం 4 రోజుల్లోనే ₹200 కోట్ల కలెక్ట్ చేసి ‘OG’ చిత్రం, పవన్ కల్యాణ్ గారి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. పాత రికార్డులన్నీ పటాపంచలయ్యాయి!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad