OG Ticket Auction Record Price: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే రిలీజ్‌కి ముందే రికార్డులు సృష్టిస్తుంది. అది అందరికీ తెలిసిందే. పవన్ సినిమా వస్తుందంటే చాలు.. టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి రిలీజ్ వరకు హడావుడి మామూలుగా ఉండదు. ఇప్పటివరకూ ఏ సినిమాకి అయినా ప్రీమియర్ షోలు, ఆ షోలకు టికెట్ల ధరలు పెంచడం చూస్తుంటాం. కానీ ఫర్ ది ఫస్ట్ టైం.. పవన్ నటిస్తున్న ‘OG’ సినిమా టికెట్‌కు వేలం పాట పాడటం చరిత్ర సృష్టిస్తోంది.
ఈ నెల 25న ఓజీ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ క్రమంలో OG సినిమా బెన్‌ఫిట్ షో టికెట్లకు వేలం పాట పాడారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన వేలం పాటలో ఒక టికెట్ ఏకంగా రూ. 1,29,999 పలికింది. ఈ టికెట్‌ను పవన్ వీరాభిమాని ఆముదాల పరమేష్ సొంతం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని జనసేన పార్టీ కార్యాలయానికి ఇవ్వనున్నట్లు తెలిపారు.
సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తుండగా.. ఫుల్ యాక్షన్ క్రైమ్ డ్రామాగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ కాగా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.


