Raju Gari Gadhi 4: ఓంకార్ దర్శకత్వంలో హారర్ కామెడీ కాన్సెప్ట్‌లతో రూపొందిన రాజుగారి గది సిరీస్ సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఈ ఫ్రాంచైజ్‌లో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. తాజాగా రాజు గారి గది సిరీస్‌లో నాలుగో పార్ట్ రాబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
దసరా కానుకగా…
దసరా కానుకగా రాజుగారి గది 4ను అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ఉగ్రరూపంలో ఉన్న కాళికా అమ్మవారి ముందు ఎర్రచీరలో ఓ యువతి గాలిలో తేలుతూ కనిపిస్తోంది. ప్రీ లుక్ పోస్టర్ ఆసక్తిని పంచుతోంది. డివోషనల్ టచ్‌తో సాగే హారర్ కామెడీ మూవీగా రాజుగారి గది 4ను డైరెక్టర్ ఓంకార్ తెరకెక్కించబోతున్నారు. కాలికాపురం అనే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ సాగనున్నట్లు ప్రకటించారు. నవ్విస్తూనే భయపెడుతుందని మేకర్స్ పేర్కొన్నారు. రాజుగారి గది 4 టైటిల్ కింద ఉన్న శ్రీచక్రం అనే క్యాప్షన్ ఆకట్టుకుంటోంది. డివైన్ హారర్ బిగిన్స్ అంటూ పోస్టర్‌పై ఉన్న ట్యాగ్‌లైన్ ఆసక్తిని పంచుతోంది.
రాజుగారి గది 4 సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రాజుగారి గది 3 చిత్రం 2019లో రిలీజైంది. దాదాపు ఆరేళ్ల తర్వాత నాలుగో పార్ట్ తెరపైకి తీసుకున్నాడు డైరెక్టర్ ఓంకార్.
Also Read- Bigg Boss Priya Shetty: నాకు అన్నీ ఎక్కువే.. ఉడుకు రక్తం కదా.. ప్రియా శెట్టి కామెంట్స్ వైరల్
రిలీజ్ డేట్ కన్ఫామ్…
రాజుగారి గది 4 షూటింగ్ త్వరలో మొదలుకానున్నట్లు వెల్లడించారు. ఈ హారర్ కామెడీ మూవీలో హీరోహీరోయిన్లు ఎవరన్నది మేకర్స్ వెల్లడించలేదు. కానీ రిలీజ్ డేట్ మాత్రం రివీల్ చేశారు. 2026 దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు.
నాగార్జున, సమంత…
రాజుగారి గది 4లో టాలీవుడ్ అగ్ర హీరో లీడ్ రోల్‌లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజుగారి గది, రాజుగారి గది 3లో ఓంకార్ తమ్ముడు అశ్విన్ హీరోగా నటించాడు. రాజుగారి గది 2లో మాత్రం నాగార్జున, సమంత కీలక పాత్రలు పోషించారు.
Also Read- Deepika Padukone: ప్రభాస్, షారుఖ్‌ఖాన్‌లను దాటేసిన దీపికా పదుకొనె – క్రేజ్ మామూలుగా లేదుగా
మిరాయ్‌తో…
ఇటీవలే మిరాయ్ మూవీతో నిర్మాతగా పెద్ద విజయాన్ని అందుకున్నారు టీజీ విశ్వప్రసాద్. మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ 150 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది. తేజా సజ్జా హీరోగా నటించిన ఈ మూవీకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు.


