Nithiin Thammudu Movie: తమ్ముడు మూవీతో వరుసగా ఏడో డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు నితిన్. వకీల్‌సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో దిల్‌రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ మూవీ తొలిరోజు నుంచి నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకుంది. నితిన్ కెరీర్‌లోనే లోయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా చెత్త రికార్డును మూటగట్టుకుంది.
మరోసారి ప్రూవ్….
పవన్ కళ్యాణ్ కల్ట్ టైటిల్‌తో నితిన్ సినిమా చేయడం, దిల్‌రాజు జడ్జిమెంట్, అగ్రెసివ్ ప్రమోషన్స్ కారణంగా తమ్ముడు మూవీపై రిలీజ్‌కు ముందు భారీగానే ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. అక్కాతమ్ముళ్ల కథలో సోల్ మిస్సవ్వడం సినిమా మిస్ ఫైర్ అయ్యింది. నితిన్‌కు ఓల్డ్ సినిమా టైటిల్స్ సెంటిమెంట్ అచ్చిరాదని తమ్ముడు మూవీతో మరోసారి ప్రూవ్ అయ్యింది. తమ్ముడు కంటే ముందు పాత క్లాసిక్ మూవీ టైటిల్స్‌తో నితిన్ చాలానే సినిమాలు చేశాడు. భీష్మ మినహా మిగిలిన సినిమాలన్నీ డిజాస్టర్స్‌గా నిలిచాయి.
Also Read- Kingdom: లక్కీ డేట్ రోజున రౌడీ స్టార్..కలిసొచ్చేనా!
అల్లరి బుల్లోడు..,.
నితిన్ హీరోగా సీనియర్ డైరెక్టర్ కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో 2005లో అల్లరిబుల్లోడు పేరుతో ఓ యాక్షన్ కామెడీ మూవీ రూపొందింది. సూపర్ స్టార్ కృష్ణ టైటిల్‌తో వచ్చిన ఈ మూవీ పట్టుమని వారం కూడా థియేటర్లలో నిలబడలేకపోయింది. అల్లరిబుల్లోడు సినిమాలో నితిన్‌కు జోడీగా త్రిష హీరోయిన్‌గా నటించడం గమనార్హం. కృష్ణ మరో మూవీ ఛల్ మోహన రంగా టైటిల్‌ను కూడా నితిన్ వాడేశాడు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ప్రొడక్షన్‌లో సినిమా చేశానన్న పేరు తప్ప నితిన్‌కు ఛల్ మోహన రంగా హిట్టు మాత్రం తెచ్చిపెట్టలేకపోయింది.
చిరంజీవి సినిమా టైటిల్‌తో…
మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ హీరో టైటిల్‌తోనూ నితిన్ ఓ సినిమా చేశాడు. అతడి ఫ్లాప్‌లిస్ట్‌లో ఒకటిగా నిలవడం తప్పితే నితిన్ కెరీర్‌కు హీరో ఏ విధంగాను ఉపయోగపడలేదు. శ్రీనివాస కళ్యాణం…1980 దశకంలో హీరో వెంకటేష్ కెరీర్‌లో మంచి లవ్‌స్టోరీగా ప్రేక్షకులను మెప్పించింది. ఈ పొయెటిక్ టైటిల్‌తో నితిన్ హీరోగా దిల్‌రాజు నిర్మాణంలో 2018లో ఓ సినిమా వచ్చింది. శతమానంభవతి ఫేమ్ సతీష్ వేగేశ్న ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. పెళ్లి వేడుక గొప్పతనాన్ని వివరిస్తూ వచ్చిన శ్రీనివాస కళ్యాణం మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
Also Read- Sukumar ramcharan movie: RC17 – సుకుమార్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు.. మరో రంగస్థలం కాబోతోందా..?
భీష్మ ఒక్కటే హిట్…
ఓల్డ్ టైటిల్స్‌తో నితిన్ చేసిన సినిమాల్లో భీష్మ ఒక్కటే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వెంకీ కుడుముల డైరెక్షన్స్‌లో రొమాంటిక్ యాక్షన్ కామెడీగా రూపొందిన ఈ మూవీ యాభై కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా కథతో పాటు నితిన్, రష్మిక మందన్న కెమిస్ట్రీ, కామెడీ ప్రేక్షకులను మెప్పించాయి.
ఎల్లమ్మ…
తమ్ముడు తర్వాత నితిన్ ఎల్లమ్మ పేరుతో తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో మూవీ చేయబోతున్నాడు. బలగం ఫేమ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని తమ్ముడు ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్, సాయిపల్లవిలలో ఒకరు హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.


