Tags: తెలుగు సినిమా హీరోల ట్యాగ్ అప్పుడప్పుడు మారడం మనం చూస్తూ ఉంటాం. ఒక హీరో కెరీర్‌లో పైకి ఎదిగినప్పుడు, పెద్ద హిట్ కొట్టినప్పుడు, తన స్థాయికి తగ్గట్టుగా కొత్త ట్యాగ్‌ను పెట్టుకోవాలని అనుకోవడం సహజం. రీసెంట్ గా, రామ్ చరణ్ విషయంలో ఇదే జరిగింది. ‘RRR’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చాక, చరణ్ కు ‘గ్లోబల్ స్టార్’ అనే కొత్త ట్యాగ్‌ను తగిలించారు. కానీ, ‘RRR’ సినిమా తర్వాత చేసిన సినిమాలు ఏవీ ఆడకపోవడంతో ఆ ట్యాగ్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడంతో, ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ కోసం పాత ట్యాగ్ అయిన ‘మెగా పవర్ స్టార్’ తో మళ్లీ తిరిగి వస్తున్నాడు. దీనిని బట్టి, కొత్త ట్యాగ్ ఎంత పెద్దదైనా, దాన్ని ఆడియన్స్ ఏక్సెప్ట్ చేయడం కూడా అంతే ముఖ్యం.
ALSO READ: RGV: రమ్యకృష్ణ పోస్టర్ లుక్స్ తో ఒక్కసారిగా పెరిగిన హైప్!
రామ్ చరణ్‌తో పాటు, రామ్ పోతినేని కూడా తన ట్యాగ్‌ను మార్చుకుంటున్నాడు. మాస్ ఇమేజ్ కోసం మధ్యలో ‘ఉస్తాద్’ లాంటి ట్యాగ్‌ను వాడిన రామ్, ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో ఇప్పుడు మళ్లీ అందరికీ బాగా నచ్చిన ‘ఎనర్జిటిక్ స్టార్’ ట్యాగ్‌తోనే ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. నిజానికి, గతంలో చాలా మంది హీరోలు ఇలాగే చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం ‘శక్తి’ సినిమా సమయంలో ‘యంగ్ టైగర్’ నుండి ‘ఏ వన్ స్టార్’ గా మారాడు. కానీ, ఆ సినిమా ఫ్లాప్ కావడంతో వెంటనే పాత ట్యాగ్‌కే వచ్చేసాడు. ఈ ట్యాగ్స్ గోల చూస్తే, ట్యాగ్స్ కేవలం సినిమా పబ్లిసిటీ కోసమే కాకుండా, అవి సినిమా ఫలితాలపై, ముఖ్యంగా ఫ్యాన్స్ ఇష్టాయిష్టాలపై కూడా ఆధారపడతాయని తెలుస్తోంది.
కొత్త ట్యాగ్ లను తీసుకురావడానికి ముఖ్య కారణం, ఆ హీరో స్టార్‌డమ్‌ను పెంచుతూ, ఫ్యాన్స్ లో ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడానికి. అయితే, ఆ కొత్త ట్యాగ్‌ను ప్రేక్షకులు, ముఖ్యంగా ఫ్యాన్స్ అంగీకరిస్తేనే అది నిలబడుతుంది. లేదంటే, సినిమా విజయం సాధించకపోయినా, ఫ్యాన్స్ అంచనాలను అందుకోకపోయినా, ఆ కొత్త ట్యాగ్ విమర్శలకు దారి తీస్తుంది. అందుకే, రామ్ చరణ్, రామ్ పోతినేని వంటి హీరోలు సెంటిమెంట్ ఉన్న, ఫ్యాన్స్ ఇష్టపడే పాత ట్యాగ్‌లైన ‘మెగా పవర్ స్టార్’, ‘ఎనర్జెటిక్ స్టార్’ వైపు మళ్లీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.


