Inspector Zende: ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ మూవీకి దర్శకత్వం వహించాడు ఓంరౌత్. రామాయణ గాథ ఆధారంగా ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీ బడ్జెట్ మూవీస్‌లో ఒకటిగా తెరకెక్కిన ఆదిపురుష్ డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతలకు మూడు వందల కోట్లకుపైనే నష్టాలను మిగిల్చింది.
నెగెటివ్ కామెంట్స్…
డైరెక్టర్‌గా ఓంరౌత్ టేకింగ్‌పై దారుణంగా విమర్శలొచ్చాయి. ఆదిపురుష్ సినిమాలో రామాయణాన్ని వక్రీకరించాడంటూ ఔంరౌత్‌ను ఆటాడుకున్నారు. డైలాగ్స్, వీఎఫ్ఎక్స్‌తో పాటు రావణాసురుడి పాత్రను చిత్రీకరించిన విధానంపై ఓ రేంజ్‌లో నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. తెలుగుతో పాటు హిందీ భాషల్లో ఒకేసారి రూపొందిన ఆదిపురుష్ రెండు చోట్ల ఫెయిల్యూర్‌గానే నిలిచింది.
Also Read – Sangeetha: సంగీత విడాకుల వార్తలపై స్పందన: పుకార్లను కొట్టిపారేసిన నటి
రెండేళ్ల తర్వాత…
ఆదిపురుష్ డిజాస్టర్‌తో రెండేళ్ల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఓంరౌత్ తాజాగా ప్రొడ్యూసర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇన్స్‌పెక్టర్ జిందే పేరుతో ఓ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీని నిర్మించాడు ఓంరౌత్. ఈ బాలీవుడ్ థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలోకి రాబోతుంది.
Jim Sarbh and Manoj Bajpayee found guilty of another fire performance 🥰
Watch Inspector Zende, out 5 September, only on Netflix.#InspectorZendeOnNetflix pic.twitter.com/GZHXmKPZEy
— Netflix India (@NetflixIndia) August 7, 2025
నెట్‌ఫ్లిక్స్‌లో…
సెప్టెంబర్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఇన్స్‌పెక్టర్ జిందే మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ గురువారం అనౌన్స్‌చేసింది. ఇన్స్‌పెక్టర్ జిందే మూవీలో మనోజ్‌బాజ్‌పాయ్, జిమ్ సర్భ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు చిన్మయ్ డి మాండ్లేకర్ దర్శకత్వం వహించాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తిని పంచుతోంది.
స్విమ్ సూట్ కిల్లర్…
1970-80 దశకంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్విమ్‌సూట్ కిల్లర్ కేసు ఆధారంగా ఇన్స్‌పెక్టర్ జిందే మూవీ రూపొందుతోంది. ఈ మూవీలో మనోజ్ బాయ్‌పాయ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా, జిమ్ సర్బ్ కిల్లర్ పాత్రలో కనిపించబోతున్నట్లు అనౌన్స్‌మెంట్ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. ఈ మూవీలో సచిన్ ఖేడ్కర్, గిరిజ ఓక్, బాలచంద్ర కడమ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
Also Read – CM Revanth: BC రిజర్వేషన్.. ఖర్గేకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
కుబేరలో విలన్‌గా…
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేర సినిమాలో విలన్‌గా నటించాడు జిమ్ సర్బ్. నీరజ్ మిత్ర అనే పాత్రలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. మరోవైపు మనోజ్‌బాజ్‌పాయ్ గత కొన్నాళ్లుగా ఎక్కువగా ఓటీటీ సినిమాలు, సిరీస్‌లోనే కనిపిస్తున్నారు.


