Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చాలా సటిల్డ్‌గా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇటీవలే తండ్రి అయిన ఈ మెగా హీరో ప్రస్తుతం ఆ ఎంజాయ్‌మెంట్ లో ఉన్నాడు. కెరీర్ బిగినింగ్ నుంచి హడావిడి లేకుండా సినిమాలు చేస్తూ వస్తున్న వరుణ్.. టాలీవుడ్‌లో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. మాస్ హీరోగా, లవర్ బాయ్ గా మాత్రమే కాకుండా అంతరిక్షం లాంటి సినిమాలతో ప్రయోగం చేశాడు.
సక్సెస్ విషయం పక్కన పెడితే, మెగా హీరోలు డాన్సులకి, ఫైట్స్ కి పెట్టింది పేరు. వీటి కోసం ఎంతగా శ్రమిస్తారో ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తుంటారో అందరికీ తెలిసిందే. ఇక, వరుణ్ తేజ్ కి ఈ మధ్య కాలంలో సోలో హీరోగా సరైన హిట్ లేదు. కానీ, మల్టీస్టారర్ మూవీస్ తో మాత్రం మంచి విజయాలను అందుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలతో వరుణ్ భారీ కమర్షియల్ సక్సెస్‌లను అందుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎఫ్ 3లో నత్తివాడిగా వరుణ్ పర్ఫార్మెన్స్ కి ప్రేక్షకులు నవ్వలేక పొట్టపట్టుకున్నారు.
ఇక, ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కొరియన్ కనకరాజు అనే డిఫరెంట్ జానర్ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యంగా జరుగుతోంది. తాజా సమాచారం మేరకు, ఈ సినిమా చిత్రీకరణ 80 శాతం కి పైగా పూర్తైందట. నవంబర్ వరకూ మొత్తం షూటింగ్ కంప్లీట్ అవుతుందని, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ని కంప్లీట్ చేనున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మరోసారి లవర్ బాయ్ గా వరుణ్..?
ఫిదా సినిమాలో లవర్ బాయ్‌గా వరుణ్ తేజ్ నటించి మంచి హిట్ అందుకున్నాడు. అలాగే, తొలిప్రేమ లాంటి సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నాడు. మళ్ళీ, లవర్ బాయ్‌గా వరుణ్ కనిపించబోతున్నట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొరియన్ కనకరాజు పూర్తవగానే, విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న కొత్త ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించబోతున్నారట. డిసెంబర్ నుంచి ఈ ప్రాజెక్ట్ మొదలవనున్నట్టుగా సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుందట. మైత్రీలో ఇప్పటికే మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.
Also Read- Sukumar: రామ్ చరణ్‌తో చేసేది ఆ సినిమాకు సీక్వెలా..?


