Sunday, January 12, 2025
Homeచిత్ర ప్రభPrasanth Varma: ‘హను-మాన్‌’మూవీకి ఏడాది.. టాటూతో ప్రశాంత్‌ వర్మ సెలబ్రేషన్

Prasanth Varma: ‘హను-మాన్‌’మూవీకి ఏడాది.. టాటూతో ప్రశాంత్‌ వర్మ సెలబ్రేషన్

యువ హీరో తేజ సజ్జా(Teja Sajja) ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్‌ వర్మ(Prasanth Varma) తెరకెక్కించిన చిత్రం ‘హను-మాన్‌’(Hanu-man). గతేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పాన్ ఇండియా హిట్‌గా నిలిచింది. నేటితో ఈ మూవీ విడుదలై ఏడాది అయిన సందర్భంగా ప్రశాంత్ వర్మ.. హనుమంతుడి గదను తన చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నారు. అలాగే అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ ఎక్స్‌ వేదికగా ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు.

- Advertisement -

‘‘హను-మాన్‌’ మూవీపై మీరు చూపించిన అశేష ప్రేమాభిమానానికి ఎంతో సంతోషంగా ఉన్నా. భారతీయ ఇతిహాస కథకు సూపర్ ‌హీరో హంగులు జోడించి మా విజన్‌ను మీ ముందుకు తీసుకువచ్చి నేటితో ఏడాది అవుతోంది. ఈ చిత్రానికి మీరు అందించిన సపోర్ట్‌ నాకెంతో విలువైనది. ఈ మేజిక్‌ను క్రియేట్‌ చేయడంలో భాగమైన నటీనటులు, నిర్మాతలకు నా ధన్యవాదాలు. విజయాన్ని మించి అభిరుచి, ఆశీస్సులు ఉంటే తప్పకుండా అద్భుతాలు సృష్టించవచ్చు అనే గట్టి నమ్మకాన్ని ఈ సినిమా నాకు అందించింది. మీరు నాపై ఉంచిన నమ్మకానికి, నాకు ఎంతగానో మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు’’ అని ఓ ప్రకటన షేర్ చేశాడు.

ఇదిలా ఉంటే ‘హను-మాన్‌’కు కొనసాగింపుగా ‘జై హనుమాన్‌’ చిత్రం రానుంది. కన్నడ హీరో రిషభ్‌ శెట్టి ఇందులో హనుమాన్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ ‌లుక్‌ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News