SPIRIT – #OneBadHabit : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘స్పిరిట్’. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, అనిమల్ చిత్రాలతో హీరోలను వయొలెంట్‌గా, రూడ్‌గా..డిఫరెంట్ కోణంలో ఆవిష్కరించే దర్శకుడు సందీప్ అసలు ప్రభాస్‌ను ఎలా చూపించబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ క్రియేట్ అయ్యింది. ఎప్పుడెప్పుడు సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందా.. అప్డేట్ వస్తుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూడసాగారు. ఎట్టకేలకు షూటింగ్ షురూ కాకుండానే స్పిరిట్ నుంచి అప్‌డేట్ రాదేమోనని అందరూ భావించారు. కేవలం ఏదైనా పోస్టర్‌తో సరిపెట్టేస్తారేమోనని భావించారు. అయితే సందీప్ వంగా మరోసారి తన మార్క్ చూపించాడు. స్పిరిట్ మూవీకి సంబంధించి డిఫరెంట్ వీడియోను రిలీజ్ చేశాడు.
‘స్పిరిట్’ – వన్ బ్యాడ్ హ్యబిట్ అనే వీడియోను విడుదల చేశారు. వీడియో గమనిస్తే.. కేవలం సినిమాలోని హీరో ప్రభాస్, హీరోయిన్ త్రిప్తి దిమ్రి సహా ముఖ్య పాత్రల్లో కనిపించబోయే కొంత నటీనటులు, దర్శక, నిర్మాతలు పేర్లను రివీల్ చేస్తూనే డైలాగ్స్‌తో ఈ వీడియో ఉంది. ఈ వీడియోలో ప్రభాస్, ప్రకాష్ రాజ్, సహా మరో వ్యక్తి గొంతు ఉంది. సంభాషణ చూస్తే ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ మధ్య జరిగే సంభాషణ. హీరో యూనిఫాం ఉన్నా, లేకపోయినా రూడ్‌గా..నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు వెళ్లిపోయే వ్యక్తి అని తెలుస్తోంది. అతను ఓ నేరంలో ఇరుక్కుని రిమాండ్ పీరియడ్‌లో జైలుకి వస్తే అక్కడ జైలర్‌గా ఉన్న ప్రకాష్‌రాజ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన హీరోతో ఎలా బిహేవ్ చేస్తాడు.. దానికి మరో పోలీస్ ఆఫీసర్ అభ్యంతరం చెప్పినా ఎందుకు ఒప్పుకోడు.. అనే సీన్‌ను కేవలం డైలాగ్స్‌తోనే మన కళ్లకు కట్టేలా చేశారు. అయితే చివరలో ప్రభాస్ వాయిస్‌లో మిస్టర్ సూపరిడెంట్ నాకు చిన్నప్పటి నుంచి నాకొక చెడ్డ అలవాటు ఉంది. రైట్ ఫ్రమ్ చైల్డ్ హుడ్ ఐ హేవ్ వన్ బ్యాడ్ హ్యబిట్ అని చెప్పే డైలాగ్ హైలెట్‌గా ఉంది. దీనికి వీడియో రూపం ఉండుంటే నెక్ట్స్ రేంజ్‌లో ఉండేది. కానీ .. సందీప్ ఇప్పటి వరకు ఎవరూ చూపించని ఓ వపర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ను స్పిరిట్ సినిమాలో చూపించబోతున్నాడనేది స్పష్టమవుతోంది.
స్పిరిట్ మూవీని సెప్టెంబర్ నుంచే మొదలు పెడదామని ఓ ఇంటర్వ్యూలో సందీప్ వంగా చెప్పాడు. అయితే కొన్ని కారణాలతో కుదరలేదు. అయితే షూటింగ్ మాత్రం ఈ ఏడాదిలోనే ఉంటుందని సినీ సర్కిల్స్ సమాచారం. స్పిరిట్ మూవీ వచ్చే ఏడాదిలో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.


