Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభOoha : 'ఆమె' నుంచి జీవితం వరకు ఓ ప్రయాణం.. ఎన్నో అనుభూతులు!

Ooha : ‘ఆమె’ నుంచి జీవితం వరకు ఓ ప్రయాణం.. ఎన్నో అనుభూతులు!

Ooha : టాలీవుడ్‌లో అందమైన జంటల్లో శ్రీకాంత్-ఊహ ఒకరు. శ్రీకాంత్ హీరోగా ఎదుగుతున్న సమయంలో, శివరంజని పేరుతో తమిళ, మలయాళ సినిమాల్లో నటించిన ఊహ, తెలుగు తెరకు ‘ఆమె’ సినిమాతో పరిచయమయ్యారు. ఈ సినిమాతోనే శ్రీకాంత్‌తో ఆమె సినిమా ప్రయాణం మొదలై, ప్రేమగా మారి, పెళ్లితో ముగిసింది. ‘మహా మ్యాక్స్’ ఇంటర్వ్యూలో ఊహ తన సినిమా, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

- Advertisement -

“ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తెలుగులో మరో శివరంజని ఉండటంతో, ఈవీవీ గారు నా పేరును ‘ఊహ’గా మార్చారు. తెలుగు సరిగా రాకపోవడంతో భయపడ్డాను. కానీ ‘ఆమె’ సినిమాతో మంచి పాత్ర దొరకడం అదృష్టం. ఆ సినిమాలో శ్రీకాంత్‌తో మొదటి సన్నివేశం పెళ్లి సీన్. తర్వాత నిజ జీవితంలో పెళ్లి జరగడం చిత్రంగా అనిపించింది” అని ఊహ చెప్పారు.

శ్రీకాంత్ నటించిన సినిమాల్లో ‘తారకరాముడు’ తనకు ఫేవరేట్ అని, ‘ఖడ్గం’ కూడా ఇష్టమని ఊహ తెలిపారు. “శ్రీకాంత్ సినిమాల్లో నచ్చనిది ఒకటి ఉంది, కానీ దాని గురించి చెప్పను,” అని నవ్వుతూ చెప్పారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించిన ఆమె, తన పిల్లల కెరియర్ గురించి మాట్లాడుతూ, “వాళ్లకు తాము ఏం చేయాలనే దానిపై స్పష్టత ఉంది” అని అన్నారు.

ఊహ-శ్రీకాంత్ జంట సినిమా రంగంలోనే కాక, వ్యక్తిగత జీవితంలోనూ అభిమానులకు ఆదర్శంగా నిలుస్తారు. ‘ఆమె’ సినిమాతో మొదలైన వారి ప్రేమ కథ, ఈ రోజు కూడా అందరినీ ఆకర్షిస్తోంది. ఊహ ఇంటర్వ్యూ అభిమానులకు వారి జీవితంలోని కొత్త కోణాలను తెలియజేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad