ఆస్కార్ అవార్డు గెలుచుకునే అరుదైన అవకాశం సంపాదించుకున్న పాట నాటు నాటు మరో సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. నాటు నాటు పాటను ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా సంగీత దర్శకుడు కీరవాణి ప్రదర్శించనున్నారు. వచ్చే నెల 12వ తేదీన లాస్ ఏంజిలెస్ లో అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరుగబోతోంది. తనకు ఆస్కార్ వస్తుందనే విశ్వాసం ఉందన్న ఎంఎం కీరవాణి.. హాలీవుడ్ ప్రముఖుల ముందు పాటను ప్రదర్శించటమంటే టెన్షన్ గా ఉందన్నారు. అయితే తాను అధిక బరువుతో బాధపడుతున్న విషయాన్ని గోల్డెన్ గ్లోబ్ అవార్డుల సమయంలో గుర్తించానన్న కీరవాణి.. ఇప్పుడు తనకు ఎక్కువసేపు నించోవటం, మాట్లాడటం, పాడటం కష్టంగా మారుతోందన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే మెదడు బాగా చురుగ్గా పనిచేస్తుందని, మంచి పాటలు కంపోజ్ చేయాలంటే ఆరోగ్యంగా ఉండాలన్నారు. దేశానికి గర్వకారణమైన పాటలు స్వరపరచేందుకు తాను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని..గత కొన్నేళ్లుగా తాను ఆరోగ్యాన్నిపూర్తిగా నిర్లక్ష్యం చేసిన విషయం ఇప్పుడు తెలిసొస్తోందన్నారు.
Oscar: ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ ప్రదర్శించనున్న కీరవాణి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES