Oscars 2026: 2026 ఆస్కార్ అవార్డుల కోసం ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా బాలీవుడ్ మూవీ హోమ్ బౌండ్ నిలిచింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో హోమ్ బౌండ్ పోటీ పడనున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా శుక్రవారం ప్రకటించింది. ఆస్కార్ నామినేషన్ కోసం హోమ్ బౌండ్‌తో పాటు మొత్తం 24 సినిమాలు పోటీ పడ్డాయట. అందులో ఐదు తెలుగు సినిమాలు కూడా ఉండటం గమనార్హం. కానీ ఆస్కార్ నామినేషన్స్‌లో తెలుగు సినిమాలకు నిరాశే ఎదురైంది.
పుష్ప 2… సంక్రాంతికి వస్తున్నాం…
2026 ఆస్కార్ నామినేషన్స్ కోసం తెలుగు నుంచి అల్లు అర్జున్ పుష్ప2, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, మంచు విష్ణు కన్నప్ప, ధనుష్ కుబేరతో పాటు డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి లీడ్ రోల్‌లో నటించిన గాంధీతాత చెట్టు పోటీలో నిలిచాయి. కానీ ఈ తెలుగు సినిమాలకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ మెంబర్స్ పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. బాలీవుడ్ నుంచి ది బెంగాల్ ఫైల్స్, కేసరి ఛాప్టర్ 2, సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్ లాంటి సినిమాలో కూడా రేసులో నిలిచాయి. వీటన్నింటిని కాదని హోమ్ బౌండ్ సినిమాను ఇండియా నుంచి అఫీషియల్‌గా ఎంట్రీగా సెలెక్ట్ చేశారు.
Also Read – Cow Attack Video: పగబట్టిన ఆవు.. వృద్ధుడిని ఈడ్చుకెళ్లి మరీ దాడి.. వీడియో వైరల్..!
దక్షిణాది సినిమాలపై వివక్ష…
ఆస్కార్ కమిటీ తీరుపై కొందరు విమర్శలు చేస్తుండగా… మరికొందరు మాత్రం సరైన నిర్ణయమని అంటున్నారు. సెలెక్షన్ తీరులో ప్రతిసారి దక్షిణాది సినిమాలపై వివక్ష కొనసాగుతూనే ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరికొందరు నెటిజన్లు మాత్రం సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప కంటే గొప్ప సినిమాలు తెలుగులో చాలా వచ్చాయని వాటిని నామినేషన్స్ కోసం పంపిస్తే బాగుండేదని అంటున్నారు.
లాక్‌డౌన్ టైమ్‌లో…
98వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో హోమ్ బౌండ్ పోటీ పడనుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ మ్యూజిక్ వంటి కేటగిరీలలో మాత్రమే ఇండియా ఇప్పటి వరకు ఆస్కార్‌లను గెలుచుకుంది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీల్మ్ విభాగంలో ఇప్పటి వరకు ఆస్కార్ రాలేదు. లగాన్, సలామ్ బాంబేతో మదర్ ఇండియా వంటి సినిమాలో చివరి వరకు పోటీలో నిలిచినా అవార్డులు దక్కలేదు. హోమ్ బౌండ్ తుది నామినేషన్స్‌లో నిలుస్తుందా లేదా అన్నది వచ్చే ఏడాది తేలనుంది.
లాక్‌డౌన్ టైమ్‌లో వలస కార్మికులు ఎదుర్కొన్న సమస్యల నేపథ్యంలో డైరెక్టర్ నీరజ్ ఘైవాన్ ఈ సినిమాను తెరకెక్కించారు. కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాలో ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వీకపూర్ కీలక పాత్రలు పోషించారు.
Also Read – Ukrainian Couple Hindu Marriage: ఇదెక్కడి లవ్ రా బాబు.. భారతీయం సాంప్రదాయంలో ఒక్కటైన 72 వెడ్స్ 27 జంట..!!


