OTT and Theaters: ఈ వారం థియేటర్లలోకాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశాలతో కూడిన చిన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఓటీటీలో మిరాయ్‌తోపాటు పలు బ్లాక్‌బస్టర్ మూవీస్ సందడి చేయనున్నాయి.
అనసూయ ఆరి…
అనసూయ ప్రధాన పాత్రలో నటించిన ఆరి మూవీ అక్టోబర్ 10న థియేటర్లలోకి రానుంది. ఆరిషడ్వర్గాల నేపథ్యంలో సాగే ఈ సినిమాకు పేపర్ బాయ్ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయికుమార్, వినోద్ వర్మ, వైవా హర్ష, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ వారం రిలీజ్ అవుతోన్న సినిమాల్లో ఆరిపైనే మోస్తారు అంచనాలు నెలకొన్నాయి.
వరుణ్ సందేశ్ కానిస్టేబుల్…
హిట్టు కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాడు వరుణ్ సందేశ్. యాక్షన్ కథతో వరుణ్ సందేశ్ చేసిన లేటేస్ట్ మూవీ కానిస్టేబుల్ ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతుంది. ఆర్యన్ సుభాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మధులిక వారణాసి హీరోయిన్‌గా నటిస్తోంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా కానిస్టేబుల్ మూవీ రూపొందుతోంది.
శశివదనే….
రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ హీరోహీరోయిన్లుగా నటించిన శశివదనే ఈ వారమే థియేటర్లలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నది. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో స్వచ్ఛమైన ప్రేమకథగా రూపొందిన ఈ సినిమాకు సాయి మోహన్ దర్శకత్వం వహించాడు.
Also Read – Prabhas: యూరప్ బయలుదేరిన “ది రాజాసాబ్”
ఓటీటీలో సూపర్ హిట్ మూవీస్…
ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా పలు సూపర్ హిట్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
మిరాయ్…
థియేటర్లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మిరాయ్ మూవీ అక్టోబర్ 10న జియో హాట్‌స్టార్‌లో రిలీజ్ కాబోతుంది. తేజ సజ్జా, రితికా నాయక్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో మంచు మనోజ్ విలన్‌గా నటించాడు. థియేటర్లలో 150 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్న ఈ మూవీకి కార్తిక్ ఘట్టమనేని దర్శకుడు.
త్రిబాణధారి బార్బరిక్..
సత్యరాజ్, ఉదయభాను, వశిష్ణ సింహా ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ త్రిబాణధారి బార్బరిక్ మూవీ సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మోహన్ వశిష్ట డైరెక్షన్‌లో రూపొందిన ఈ మూవీకి దర్శకుడు మారుతి ప్రజెంటర్‌గా వ్యవహరించాడు.
ఎన్టీఆర్ వార్ 2..
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన వార్ 2 మూవీ అక్టోబర్ 9న నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది. మిక్స్‌డ్ టాక్‌తో 400 కోట్ల వరకు వసూళ్లను దక్కించుకున్నది.
సెర్చ్ ది నైనా మర్డర్ కేస్ – అక్టోబర్ 10 – జియో హాట్ స్టార్
ది కంజూరింగ్ 4 లాస్ట్ రైల్స్ – అక్టోబర్ 7 – అమెజాన్ ప్రైమ్ వీడియో
ది ఉమెన్ ఇన్ క్యాబిన్ 10 – నెట్‌ప్లిక్స్ – అక్టోబర్ 10
స్థల్ – అక్టోబర్ 10 – జీ5 ఓటీటీ
కురుక్షేత్ర – అక్టోబర్ 10 – నెట్‌ఫ్లిక్స్
Also Read – Telangana BC Reservations : సుప్రీంకోర్టు తీర్పుపై భట్టి విక్రమార్క హర్షం.. ఏమన్నారంటే!


