Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభRajendra Prasad: సినిమా ప్రమోషన్స్‌లో 'ఓవర్ కాన్ఫిడెన్స్'!

Rajendra Prasad: సినిమా ప్రమోషన్స్‌లో ‘ఓవర్ కాన్ఫిడెన్స్’!

Rajendra Prasad: ఈ మధ్య కాలంలో కొత్త సినిమాలు విడుదల కావడానికి ముందు స్టేజి మీద సినీమా వాళ్లు మాట్లాడే మాటలు చూస్తుంటే ప్రేక్షకులలో ఆ సినిమా మీద హైప్ పెరిగిపోతుంది. నిర్మాతలైతే మరీనూ… అందరూ తమ సినిమా గురించి అతిగా, ఆకాశానికి ఎత్తేసి మాట్లాడేస్తున్నారు. ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు ఎక్కువవుతున్నాయి. నాని వంటి హీరోల ప్రమోషన్స్‌లో అయినా, నాగ వంశీ లాంటి నిర్మాతలు ‘టిల్లు,కింగ్డమ్’ అంటూ క్రియేట్ చేసిన హంగామా అయినా, తాజాగా రాజేంద్ర ప్రసాద్ తమ సినిమా గురించి “చూసి షాక్ అవ్వకపోతే ఇండస్ట్రీ వదిలిపోతా” అన్నంత భారీ స్టేట్‌మెంట్ అయినా… ఇవన్నీ ఇప్పుడొక ట్రెండ్‌గా మారాయి.

- Advertisement -

ALSO READ: https://teluguprabha.net/cinema-news/ravi-teja-naveen-polishetty-multistarrer-comedy-entertainer/

ఈ మాటల వల్ల అసలు సమస్య ఏంటి?

మాటలు భారీగా ఉంటే, సినిమాకు ప్రచారం బాగా జరుగుతుంది, జనాలు థియేటర్‌కు వస్తారు అనుకుంటారు. కానీ ఇక్కడ పెద్ద రిస్క్ ఉంది.
సినిమా గురించి 100% నమ్మకంగా మాట్లాడితే, ప్రేక్షకుడు 200% అంచనాలతో థియేటర్‌కు వెళ్తాడు. తీరా సినిమా చూస్తే అందులో అంత మ్యాటర్ లేకపోతే, ప్రేక్షకుడు బాగా నిరాశ చెందుతాడు. ఈ నిరాశే సినిమా ఫ్లాప్ అవడానికి మొదటి కారణం అవుతుంది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/star-heroes-sons-struggles-in-film-industry/

“ఇండస్ట్రీ వదిలేస్తాను”, “ఇది మాములు హిట్ కాదు, ఇండస్ట్రీ హిట్” వంటి సవాళ్లు విసిరినప్పుడు, ఆ సినిమా రిజల్ట్ కాస్త అటు ఇటు అయితే, సినిమా టీమ్ పరువు పోతుంది. హీరో, నిర్మాత బాగానే ఉంటారు, కానీ ఆ స్టేట్‌మెంట్ మాత్రం లైఫ్ లాంగ్ వారిని వెంటాడుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతాయి. పదేపదే ఇలా అతిగా మాట్లాడటం వల్ల, నిజంగా మంచి సినిమా తీసినా కూడా, ప్రేక్షకుడికి ఆ టీం మీద నమ్మకం పోయే ప్రమాదం ఉంది. “వీళ్లు ఎప్పుడూ ఇంతేలే” అనే భావన కలుగుతుంది. కంటెంట్ మాట్లాడాలి, ఆడియో ఫంక్షన్లలో మాటలు కాదు! కంటెంట్ బాగుంటే, రిజల్ట్ దానికదే మాట్లాడుకుంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad