Pa Ranjith: కోలీవుడ్ డైరెక్టర్ పా రంజిత్ మేకింగ్‌కి ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మద్రాస్, కబాలి, కాలా, సార్‌పట్ట చిత్రాలతో మెప్పించిన ఆయనకు తంగలాన్ చిన్న షాకిచ్చిందనే చెప్పాలి. ఆయన దర్శకుడే కాదు.. నిర్మాత కూడా. తాజాగా ఆయన నిర్మాణంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘బైసన్’. ఈ సినిమా తాజా ప్రెస్ మీట్‌లో పా రంజిత్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ పా రంజిత్ చేసిన వ్యాఖ్యలు ఏంటో చూద్దాం…
‘కాంతార’లాంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నప్పుడు కొందరు కోలీవుడ్ ఫ్యాన్స్ ముగ్గురు తమిళ దర్శకులను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారని పా. రంజిత్ పేర్కొన్నారు. అంతేకాకుండా తనతో పాటు వెట్రి మారన్, మారి సెల్వరాజ్ తమిళ చిత్ర పరిశ్రమను చెడగొట్టామని తమపై విమర్శలు చేస్తుంటారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్లలో 600కిపైగా సినిమాలు విడుదలయ్యాయి. మరి, ఎంత మంది తమిళ సినిమా స్థాయిని మరింత పెంచగలిగారు? అని రంజిత్ ప్రశ్నించారు.
Also Read – Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. అత్యధిక రన్స్ చేసిన తొలి ఆసియా బ్యాటర్‌గా రికార్డు..!
పా రంజిత్ దర్శకత్వంలో రజినీకాంత్ రెండు సినిమాలను తెరకెక్కించారు. ఈ సినిమా తర్వాత పా రంజిత్‌పై చాలా విమర్శలే వచ్చాయి. ఈ ట్రోలింగ్‌పై కూడా ఈ డైరెక్టర్ రియాక్ట్ అయ్యాడు. విడుదలకు ముందే ‘కబాలి’ రూ.100 కోట్ల ప్రాఫిట్ ఇచ్చింది. అయినప్పటికీ, ఆ సినిమాపై వచ్చిన విమర్శలను ఆయన పరిగణలోకి తీసుకున్నారు. స్క్రీన్‌ప్లేలో సమస్యలు ఉన్నాయి అని, తాను దానిని అంగీకరిస్తా అని రంజిత్ స్పష్టం చేశారు.
ఇప్పుడు పా రంజిత్ వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించివనే డిస్కషన్ ఇండస్ట్రీలో నడుస్తోంది. కొందరు ఆయన వ్యాఖ్యలను సమర్ధిస్తుంటే.. మరి కొందరు తప్పు పడుతున్నారు. బైసన్ సినిమా విషయానికి వస్తే.. రీసెంట్‌గా తమిళ, తెలుగు భాషల్లో రిలీజైన ఈ సినిమాలో విక్రమ్ తనయుడు ధ్రువ్ (Dhruv) హీరోగా నటిస్తే, అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్‌గా నటించింది. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు.
Ranjith Attacks Tamil Audience, Directors, Etc ⚡️
Valid Question ⁉️
In A Way Valid As Shankar Replacement Is Missing In Tamil Cinema 💥
⚡️ Atlee Is Doing Films Outside Tamil Cinema
⚡️No Star Actors Like Rajini – Kamal In Current Gen— Analyst (@BoAnalyst) October 26, 2025
Also Read – IND- CHINA: ఐదేళ్ల తర్వాత భారత్- చైనా ప్రత్యక్ష విమానాలు పునఃప్రారంభం


