Tuesday, July 2, 2024
Homeచిత్ర ప్రభJoyLand : ఆస్కార్‌కి పంపించిన సినిమానే బ్యాన్ చేసిన పాకిస్థాన్.. ఏం తెలివిరా బాబు పాకిస్థాన్...

JoyLand : ఆస్కార్‌కి పంపించిన సినిమానే బ్యాన్ చేసిన పాకిస్థాన్.. ఏం తెలివిరా బాబు పాకిస్థాన్ వాళ్ళది..

- Advertisement -

JoyLand : పాకిస్థాన్ సినీ పరిశ్రమ నుంచి కూడా అప్పుడప్పుడు కొన్ని మంచి సినిమాలు వస్తూ ఉంటాయి. 2023 సంవత్సరం ఆస్కార్ పోటీలకు పాకిస్థాన్ నుంచి ‘జాయ్‌ల్యాండ్’ అనే సినిమాని పంపించింది అక్కడి ప్రభుత్వం. ఈ సినిమా రిలీజ్ కి కూడా పర్మిషన్ ఇచ్చారు. చిత్ర యూనిట్ కూడా చాలా సంతోషించింది.

కానీ ఇంతలో ఏం జరిగిందో తెలీదు ఈ సినిమాని పాకిస్థాన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిషేధించింది. ఈ సినిమాని బ్యాన్ చేస్తూ.. ”ఈ సినిమా మన పద్దతులపై వ్యతిరేకంగా ఉంది, ఇందులో మన సమాజంలోని విలువలకి వ్యతిరేకంగా సన్నివేశాలు ఉండటంతో ఈ సినిమాని బ్యాన్ చేస్తున్నాం” అని అక్కడి అధికారులు తెలిపారు.

అయితే ఆస్కార్ కి పంపించిన సినిమానే బ్యాన్ చేయడంతో అంతా షాక్ అయి పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఆస్కార్ కి పంపించేటప్పుడు సినిమా చూడలేదా, ఒకవేళ నిజంగా బ్యాన్ చేయాలి అనుకుంటే అప్పుడు బ్యాన్ చేయకుండా ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చిత్ర యూనిట్ ఈ విషయంలో చాలా నిరాశ చెందింది. మరి ఈ బ్యాన్ ఎత్తివేస్తారా లేక జాయ్ ల్యాండ్ సినిమాని అలాగే బ్యాన్ చేసి ఉంచుతారా చూడాలి మరి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News