Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభParineeti Chopra: ఒక్క ఛాన్స్ ప్లీజ్.. సౌత్ సినిమాల్లో ఆఫర్ కోసం బాలీవుడ్ భామ వెంపర్లాట

Parineeti Chopra: ఒక్క ఛాన్స్ ప్లీజ్.. సౌత్ సినిమాల్లో ఆఫర్ కోసం బాలీవుడ్ భామ వెంపర్లాట

- Advertisement -

Parineeti Chopra : గత సంవత్సర కాలంగా సౌత్ సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. బాలీవుడ్ లో కూడా సౌత్ సినిమాలు కలెక్షన్స్ కొల్లగొడుతున్నాయి. దీంతో బాలీవుడ్ స్టార్స్ అంతా సౌత్ సినిమాల మీద ఆసక్తి చూపిస్తున్నారు. చాలా మంది సౌత్ సినిమాల్లో నటించాలనుకుంటున్నారు. ఇక బాలీవుడ్ భామలు కూడా సౌత్ సినిమాల్లో కనిపించాలని కోరుకుంటున్నారు.

ఇప్పటికే జాన్వీ, అలియా.. లాంటి పలువురు హీరోయిన్స్ సౌత్ సినిమాల్లో ఛాన్సులొస్తే నటిస్తాం అని చెప్పారు. తాజాగా మరో బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా సౌత్ సినిమాల్లో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అని తెలిపింది. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న పరిణీతి ఇటీవల ఢిల్లీలో జరిగిన అజెండా ఆజ్‌తక్‌ 2022 అనే కార్యక్రమంలో పాల్గొనగా అక్కడి మీడియాతో మాట్లాడుతూ సౌత్ సినిమాల గురించి మాట్లాడింది.

పరిణీతి చోప్రా మాట్లాడుతూ.. నేను సౌత్ సినిమాల్లో నటించడానికి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నాను. అక్కడి సినిమాల్లో నటించడానికి ఎంతలా ఆరాటపడుతున్నానో మీకు తెలియదు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ.. ఏ భాషలో అయినా పర్లేదు, సౌత్ లో ఒక మంచి సినిమాలో నటించాలనుకుంటున్నాను. దయచేసి మీకు తెలిసిన దర్శకులు ఉంటే వారికి నా గురించి చెప్పండి అంటూ రిక్వెస్ట్ చేసింది. దీంతో పరిణీతి ఇలా అడగడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad