Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభPathaan: రిలీజ్ కు ముందే KGF2 రికార్డ్ బ్రేక్ చేసిన పఠాన్

Pathaan: రిలీజ్ కు ముందే KGF2 రికార్డ్ బ్రేక్ చేసిన పఠాన్

అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ము రేపుతున్న పఠాన్ సినిమా అప్పుడే సినీ రికార్డ్స్ ను తిరగ రాస్తోంది. షారూఖ్ ఖాన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెబుతోంది పఠాన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్. జర్మనీలో ఇప్పటికే పఠాన్ అడ్వాన్స్ బుకింగ్ ఏకంగా 150 వేల యూరోలు దాటినట్టు సినిమా యూనిట్ చెబుతోంది. అంటే ఇది కేజీఎఫ్-2 సినిమా లైఫే టైం కలెక్షన్లతో సమానం. జర్మనీలో కేజీఎఫ్ 2 ఏకంగా 144 వేల యూరోల కలెక్షన్ వసూలు చేసింది ఇప్పుడు పఠాన్ ఈ రికార్డును అధిగమించింది. ఇదంతా జస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రమే కాగా సినిమా రిలీజ్ అయ్యాక ఇంకా పెద్ద సంఖ్యలో టికెట్లు అమ్ముడుబోయే ఛాన్సులున్నాయి.

- Advertisement -

యాక్షన్, స్పై థ్రిల్లర్ గా రెడీ అయిన పఠాన్ సినిమా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. దీపికా పదుకున్, జాన్ అబ్రహ్మంతో పాటు గెస్ట్ రోల్ లో సల్మాన్ ఖాన్ మెరిసేలా ఉన్న ఈ సినిమాపై ఎస్ఆర్ కే అభిమానుల్లో బాగా అంచనాలున్నాయి. చాలాకాలం తర్వాత తమ ఫేవరెట్ హీరో కింగ్ ఖాన్ మంచి ఫామ్ లోకి వచ్చినట్టు ఫ్యాన్స్ జోష్ లో ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News