Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభPathaan: కలెక్షన్స్ 900 కోట్లు..త్వరలో 1000 కోట్ల క్లబ్ లోకి

Pathaan: కలెక్షన్స్ 900 కోట్లు..త్వరలో 1000 కోట్ల క్లబ్ లోకి

బాలీవుడ్ బాహుబలిగా బాక్సాఫీస్ షేక్ చేస్తోంది పఠాన్ సినిమా. కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ సినిమా పఠాన్ బాక్సాఫీస్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజ్ అయిన రెండవ వారం కూడా దుమ్ము దులిపేలా వసూళ్లు కొనసాగిస్తోంది. పఠాన్ దెబ్బకు శాకుంతలం, షెహజాదా వంటి సినిమాలే రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకోక తప్పలేదు. తాజాగా పఠాన్ వసూళ్లు 875 కోట్లు దాటాయి. అతి త్వరలో ఇది 1000 కోట్ల రూపాయలు వసూలు చేయటం ఖాయమనే టాక్ సంపాదించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో విడుదలై షారూఖ్ అభిమానులను ఎంటర్ టైన్ చేసిన స్పై థ్రిల్లర్ పఠాన్ కు ఇంకా టికెట్లు తెగుతుండటం విశేషం. కేజీఎఫ్ చాప్టర్-2 రికార్డులను కూడా అధిగమించిన పఠాన్ సరికొత్త రికార్డులు సృష్టించేలా దూసుకుపోతోంది. అతి త్వరలో బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా పఠాన్ ఆవిర్భవిస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News