Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభPathaan: 300 కోట్లు దాటిన పఠాన్ అడ్వాన్స్ బుకింగ్స్

Pathaan: 300 కోట్లు దాటిన పఠాన్ అడ్వాన్స్ బుకింగ్స్

కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ స్పై థ్రిల్లర్ సృష్టిస్తున్న రికార్డ్స్ మైండ్ బ్లోయింగ్ అంటున్నాయి సినిమా ట్రేడ్ వర్గాలు. విడుదల కాకముందే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఓవైపు రికార్డులు కొల్లగొడుతుంటే మరోవైపు అడ్వాన్స్ బుకింగ్స్ ఏకంగా 300 కోట్లు దాటడం విశేషం. దీంతో ఎస్ఆర్కే ఫ్యాన్స్ లో పఠాన్ ఫీవర్ పీక్స్ కు చేరింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పఠాన్ డిస్కషన్సే కాగా జనవరి 25న రిలీజ్ అయ్యే ఈ సినిమాకు జనవరి 26వ తేదీన కూడా ఉత్తరాదిలోని సిటీల్లో టికెట్లు దొరకటం లేదు. ఇక రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ కు కనక వర్షం కురిపించటం ఖాయంగా మారటంతో ఇంకెంత కలెక్షన్స్ వస్తుందోననే అంచనాలకు పదును పెడుతున్నారు. చాలా కాలం తరువాత బాలీవుడ్ కా బాద్షా సినిమా పఠాన్ వస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. మొత్తానికి సినిమా రిలీజ్ కు ముందే 300 క్రోర్స్ క్లబ్ లో చేరింది పఠాన్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News