Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభPathaan fever: బుర్జ్ ఖలీఫాపై 'పఠాన్' సినిమా

Pathaan fever: బుర్జ్ ఖలీఫాపై ‘పఠాన్’ సినిమా

కింగ్ ఖాన్ సినిమా ‘పఠాన్’ పై మంచి హైప్ ఊపందుకుంది. మరోవైపు బుర్జ్ ఖలీఫాపై పఠాన్ సినిమా ట్రేలర్ ను ప్రదర్శించనున్నారు. దుబైలోని ఐకానిక్ టవర్ బుర్జ్ ఖలీఫాపై పఠాన్ ట్రేలర్ అంటే షారూఖ్ ఫ్యాన్స్ కు పెద్ద ప్రివిలేజ్. పైగా దుబైలో షారూఖ్ కు చాలా పెద్ద ఫాలోయింగ్ కూడా ఉంది. ఆదిత్యా ఛోప్రా యాంబిషియస్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న యాక్షన్ ఎక్ట్ర్సావగాంజాగా పఠాన్ రూపుదిద్దుకుంది. యూఏఈలో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 కోసం ప్రస్తుతం ఇక్కడే ఉన్న బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ బుర్జ్ ఖలీఫా ఈవెంట్ కు అటెండ్ అవుతారని వైఆర్ఎఫ్ టీం వెల్లడించింది. ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా పఠాన్ మూవీ రిలీజ్ కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News