Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభPathaan: సూపర్.. ఫస్ట్ డే ఫస్ట్ స్క్రీనింగ్ తరువాత కొత్తగా 300 షోస్

Pathaan: సూపర్.. ఫస్ట్ డే ఫస్ట్ స్క్రీనింగ్ తరువాత కొత్తగా 300 షోస్

ఓపెనింగ్ డే పఠాన్ సినిమా ఫస్ట్ స్క్రీనింగ్ తరువాత ఏకంగా 300 షోస్ ను యాడ్ చేయాల్సి వస్తోంది థియేటర్స్ కు. దీంతో పఠాన్ సినిమా అత్యధిక థియేటర్స్ లో ఆడుతున్న రెండవ హిందీ సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 8,000 స్క్రీన్స్ లో పఠాన్ రిలీజ్ అయింది. వీటిలో 2,500 స్క్రీన్స్ ఫారిన్ లో ఉన్నవే. స్పై థ్రిల్లర్ అయిన ఈ సినిమా సూపర్బ్ అనే టాక్ రావటంతో షోస్ నంబర్ విపరీతంగా పెంచాల్సి వస్తోందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ చెబుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ లో 5.5 లక్షల టికెట్స్ ఇప్పటికే అమ్ముడుబోయాయి.

- Advertisement -

మొత్తానికి 4 ఏళ్ల తరువాత కింగ్ ఖాన్ ఈజ్ బ్యాక్.. అంటూ ఎస్ఆర్కే ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఫ్యాంటసీ యాక్షన్ మూవీగా బాలీవుడ్ కా బాద్షా స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయిందంటూ షారూఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఖుషీలో ఉన్నారు.

ఇక కామియో రోల్ లో సల్మాన్ ఖాన్ టైగర్ గా ఇరగ దీశారు. 15 నిమిషాలపాటు యాక్షన్ ప్యాక్డ్ అప్పియరెన్స్ చేసిన సల్మాన్ రష్యా మాఫియా నుంచి షారూఖ్ ను కాపాడే ఎపిసోడ్ లో హైలైట్ గా నిలిచారు. అసలు సల్మాన్, షారూఖ్ ఇద్దరూ కలిసి ఇంకా మరిన్ని సినిమాలు చేయాలని ఇప్పుడు సినిమా చూసినవారంతా అంటుండటం విశేషం. ఒక స్క్రీన్ పై ఇద్దరు మెగాస్టార్స్ ను చూడటం అదిరిపోయే ఫీలింగ్ అంటూ ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేస్తున్నాయి. కంప్లీట్ ఎంటర్ టైనరగ్ వచ్చిన షారూఖ్ పఠాన్ థియేటర్స్ లో అదరగొడుతోంది. కరోనా తరువాత ఓ కమర్షియల్ బాలీవుడ్ సినిమా ఈ రేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుండటం తొలిసారి. పైగా బాలీవుడ్ మెగాస్టార్స్ కు హిట్స్ లేక అందరూ చతికిలపడ్డ టైంలో పఠాన్ మంచి జోష్ నింపుతోంది. థియేటర్స్ కు పాత కళ వచ్చిపడింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News