Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు మూవీ మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కానీ ప్రమోషన్స్ హడావిడి మాత్రం అస్సలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న పొలిటికల్ బిజీ షెడ్యూల్స్ దృష్ట్యా పవన్ కళ్యాణ్ పర్సనల్ ఇంటర్వ్యూలు ఇవ్వడం కష్టమే. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మాత్రం పవన్ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించి సినిమాపై ఉన్న బజ్‌ను రెట్టింపు చేయాలనే ప్రయత్నాల్లో మేకర్స్ ఉన్నట్లు తెలిసింది.
వైజాగ్‌లో…
హరిహరవీరమల్లు ప్రీ రిలీజ్ (Hari Hra Veera Mallu Pre Release) ఈవెంట్ డేట్‌తో పాటు వేదిక ఫిక్సైనట్లు సమాచారం. ఈ నెల 20న వైజాగ్‌లో ఈ ఈవెంట్ జరుగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు ఎస్ఎస్ రాజమౌళితో పాటు త్రివిక్రమ్ గెస్ట్‌లుగా హాజరుకానున్నట్లు సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో సినిమాలు చేస్తున్న సుజీత్, హరిష్ శంకర్‌తో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొననున్నట్లు చెబుతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఈ ఈవెంట్‌కు సంబంధించిన వివరాలను మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించబోతున్నట్లు తెలిసింది.
Also Read – Maargan: ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మార్గన్.. తెలుగులోనూ స్ట్రీమింగ్!
హైదరాబాద్ అనుకున్నా…
తొలుత హైదరాబాద్‌లోనే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించాలని అనుకున్నారు. భద్రతాపరమైన సమస్యలతో పాటు పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్స్ దృష్ట్యా వైజాగ్‌ను వేదికగా ఫిక్స్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. హరిహరవీరమల్లు మూవీకి ఏఎమ్ జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో ఈ హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ మొదలైంది. క్రియేటివ్ డిఫరెన్సెస్‌తో క్రిష్ తప్పుకోవడంతో అతడి స్థానంలో జ్యోతికృష్ణ మిగిలిన సినిమాను పూర్తిచేశారు.
బాబీ డియోల్ (Bobby Deol) విలన్…
హరిహరవీరమల్లు మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్ విలన్‌గా కనిపించబోతున్నాడు. నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహితో పాటు అనసూయ కీలక పాత్రలు చేస్తున్నారు. 2022లో ఈ సినిమా మొదలైంది. షూటింగ్ డిలేతో పాటు ఇతర కారణాల వల్ల పలుమార్లు రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల రిలీజైన ట్రైలర్ సినిమాకు మంచి హైప్‌ను తీసుకొచ్చింది. దాదాపు 150 కోట్ల వరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. జూలై 24న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం హరిహరవీరమల్లు సినిమాను నిర్మించారు. హరిహరవీరమల్లుతో పాటు ప్రస్తుతం ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్.
Also Read – CM Chandrababu: సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ ఫుల్ షెడ్యూల్ ఇదే.. ఎవరెవరిని కలవనున్నారంటే?


