Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఎట్టకేలకు తెరపడింది. ఓజీ మూవీ వరల్డ్ వైడ్‌గా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు స్టేట్స్‌లో మాత్రం ఓజీ సంబంరాలు ఓ రోజు ముందుగానే మొదలయ్యాయి. బుధవారం ప్రీమియర్స్ నుంచే థియేటర్లలో ఓజీ సందడి మొదలైంది. ప్రీమియర్స్‌కు ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతోన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ఏం కావాలో, ఆయన్ని అభిమానులు ఎలా చూడాలని అనుకుంటున్నారో ఊహిస్తూ పర్‌ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఓజీలో పవన్ కళ్యాణ్ ఎలివేషన్లు, ఆయన హీరోయిజం, హై మూవ్‌మెంట్స్ ఫ్యాన్స్‌కు ఫుల్‌మీల్స్‌లా నిలిచాయి. తొలిరోజు బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రికార్డులను తిరగరాయడం ఖాయంగానే కనిపిస్తోంది.
Also Read- Jayam Ravi: ఈఎమ్ఐలు కట్టని కోలీవుడ్ హీరో జయం రవి – లగ్జరీ బంగ్లా వేలం
సీక్వెల్ కన్ఫామ్…
కాగా ఓజీ మూవీకి సీక్వెల్ రానున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సీక్వెల్‌ను అఫీషియల్‌గా ప్రకటించి అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేశారు మేకర్స్. ఓజీ క్లైమాక్స్‌లో సినిమాకు సీక్వెల్ రానుందని వెల్లడించారు. ఓజీ 2 పేరుతో ఈ సీక్వెల్‌ను రూపొందించబోతున్నట్లు పేర్కొన్నారు.
ఓజీ పార్ట్ 2పై డైరెక్టర్ సుజీత్ కూడా ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చాడు. ఇది అరంభం మాత్రమే.. అన్ని అనుకున్నట్లుగా సెట్ అయితే ఓజీ వరల్డ్ మరింత పెద్దది అవుతుంది అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. స్ట్రోమింగ్ ఇన్ సినిమాస్ నియర్ యూ అంటూ ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఎస్‌సీయూ అనే పదాలను బోల్డ్ చేశారు. సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ ఓజీతో మొదలుకాబోతున్నట్లు చెప్పేశాడు సుజీత్. సుజీత్ తన నెక్స్ట్ మూవీని నానితో చేయబోతున్నారు. అందులో పవన్ కళ్యాణ్ చేసిన ఓజాస్ గంభీర పాత్ర తాలూకు రిఫరెన్స్ ఉంటుందని అంటున్నారు.
Also Read- Ghaati OTT: అనుష్క ఘాటీ ఓటీటీలోకి వచ్చేస్తోంది – స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఇవే!
150 కోట్ల కలెక్షన్స్…
కాగా ఓజీ మూవీ తొలిరోజు 130 నుంచి 150 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా ఓజీ నిలవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఓజీ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించిన ఈ మూవీలో ప్రకాష్ రాజ్, శ్రియారెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషించారు. థమన్ మ్యూజిక్ అందించాడు.


