Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ పవర్ స్టార్.. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కాక ముందు సైన్ చేసిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలు రిలీజ్ కూడా అయ్యాయి. ఇక ఆయన ఖాతాలో మిగిలి ఉన్న మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. దీని తర్వాత సినిమాలు చేయటం మానేస్తారా!.. ఇదే ప్రశ్న పవన్ కళ్యాణ్‌ను ఆ మధ్య అడిగితే, ఆయన క్లారిటీ ఇచ్చేశారు. తన పార్టీని నడపటానికి డబ్బులు అవసరం కాబట్టి సినిమాలు చేస్తానని అన్నారు. అంతే కాదండోయ్ సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న వార్తల మేరకు ఆయన కొత్త కథలను వింటున్నారు.
Also Read- Bigg Boss Updates: ఉతుక్కో.. ఆరబెట్టుకో.. నాకేం కర్మ.. కళ్యాణ్ కు ఇచ్చిపడేసిన అయేషా
తాజాగా సౌత్‌లో బడా నిర్మాణ సంస్థగా అడుగులేస్తోన్న కెవిఎన్ ప్రొడక్షన్స్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయటానికి రంగం సిద్ధం చేస్తుంది. అందులో భాగంగా ఇద్దరు డైరెక్టర్స్‌ని లైనప్ చేస్తుంది. వారిలో ఒకరు లోకేష్ కనకరాజ్. మరొకరు హెచ్. వినోద్. వీరిద్దరిలో లోకేష్ కనకరాజ్‌కున్న మాస్ ఇమేజ్ గురించి అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా ఆయన చేసిన కూలీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయినప్పటికీ ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈయనతో పవన్ కళ్యాణ్ సినిమా అంటే నెక్ట్స్ రేంజ్‌లోఉంటుందనటంలో డౌట్ లేదు.
కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఇప్పుడు ధృవ్ సర్జాతో కేడీ: ది డెవిల్ సినిమాతో పాటు యష్‌తో టాక్సిక్ సినిమాను చేస్తోంది. తమిళంలో దళపతి విజయ్‌తో జననాయగన్ సినిమాను నిర్మిస్తోంది. ఇవి కాకుండా తెలుగులో చిరంజీవి, బాబీ కాంబోలో తెరకెక్కబోతున్న మాస్ కమర్షియల్ మూవీని కూడా ఈ బ్యానరే చేయబోతుంది. ఇవి కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయనుంది. అయితే పవన్‌తో సినిమా అంటే మామూలుగా ఉండదు. కొన్ని కండీషన్స్ అప్లై అవుతాయి. ఆయన బిజీ షెడ్యూల్‌ను బేస్ చేసుకుని షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటాయి. మరెమవుతుందో చూడాలి మరి.
Also Read- Dude: డ్యూడ్ రివ్యూ – ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు మూవీ హిట్టా? ఫట్టా?


