Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభOG Ticket Rates : గుడ్ న్యూస్ చెప్పేసిన తెలంగాణ ప్రభుత్వం..OG పూన‌కాలు లోడింగ్‌

OG Ticket Rates : గుడ్ న్యూస్ చెప్పేసిన తెలంగాణ ప్రభుత్వం..OG పూన‌కాలు లోడింగ్‌

OG Ticket Rates : పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) క‌థానాయ‌కుడిగా సుజీత్ (Director Sujeeth) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామా OG. డివివి దాన‌య్య నిర్మాత‌. ద‌స‌రా సందర్భంగా మూవీ సెప్టెంబ‌ర్ 25న రిలీజ్ (OG Release date) అవుతోన్న సంగ‌తి తెలిసిందే. సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లేలా మేక‌ర్స్ సెప్టెంబ‌ర్ 21 ఉద‌యం 10 గంట‌ల 8 నిమిషాల‌కు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల‌తో స‌హా వ‌ర‌ల్డ్ వైడ్ తెలుగు సినిమా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా వెయిట్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. సినిమా రిలీజ్ కావ‌టానికి ఇక 4 రోజుల మాత్ర‌మే వ్య‌వ‌ధి ఉంది.

- Advertisement -

ఈ నేప‌థ్యంలో OG మేక‌ర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెష‌ల్ షోస్‌కు అనుమ‌తి తెచ్చుకోవ‌టంతో పాటు.. టికెట్ రేట్స్‌కు పెంచుకోవ‌టానికి కూడా అనుమ‌తులు తెచ్చుకున్నారు. ఇప్ప‌టికే ఏపీ ప్ర‌భుత్వం జీవోను జారీ చేసింది. మ‌రి తెలంగాణ (Telangana) ప్ర‌భుత్వం నుంచి గుడ్ న్యూస్ ఎప్పుడు వ‌స్తుందా? అని మేక‌ర్స్ ఎదురు చూశారు. అయితే ఎట్ట‌కేల‌కు రేవంత్ ప్ర‌భుత్వం నుంచి OG విష‌యానికి సంబంధించిన శుభ‌వార్త‌ను చెప్పేశారు. ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే, సెప్టెంబ‌ర్ 24న రాత్రి 9 గంట‌ల‌కు స్పెష‌ల్ షో ప‌డుతుంది. దానికి ప‌ర్మిష‌న్ కూడా వ‌చ్చేసింది. ఈ బెనిఫిట్ షో టికెట్ రేటుని జిఎస్టీతో క‌లిపి రూ.800గా నిర్ణ‌యించారు. ఇక తెలంగాణ ప్ర‌భుత్వం సింగిల్ స్క్రీన్స్‌కు రూ.100.. మ‌ల్టీప్లెక్స్‌లో రూ.150 పెంచుకునేలా జీవోను జారీ చేసింది. ఈ పెంపుద‌ల ప‌ది రోజుల పాటు ఉంటుంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) ప్ర‌భుత్వం విష‌యానికి వ‌స్తే.. బెనిఫిట్ షో విష‌యానికి వ‌స్తే జిఎస్టీతో క‌లిపి రూ.1000గా టికెట్ ధ‌ర‌ను నిర్ణ‌యించారు. ఇక సింగిల్ స్క్రీన్స్‌కు రూ.125.. మ‌ల్టీప్లెక్స్‌లో రూ.150 వ‌ర‌కు టికెట్ రేట్స్ పెంచుకోవ‌చ్చున‌ని జీవోను జారీ చేసింది. పెంచిన ఈ టికెట్ రేట్స్ సెప్టెంబ‌ర్ 25 నుంచి అక్టోబ‌ర్ 4 వ‌ర‌కు మాత్ర‌మే. పెంచిన టికెట్ రేట్స్‌ను కొంద‌రు ఖండిస్తుంటే, ఫ్యాన్స్ మాత్రం పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌టం లేదు. ఇప్ప‌టికే సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్‌ ట్రైల‌ర్ త‌ర్వాత మ‌రింత పెరుగుతుంద‌నటంలో సందేహం లేదు. రీసెంట్ టైమ్‌లో ఈ మూవీపై ఉన్నంత అంచ‌నాలు మ‌రో సినిమాకు లేదు.

ALSO READ : https://teluguprabha.net/cinema-news/after-mirai-manchu-manoj-to-play-villain-role-chiranjeevi-director-bobby-movie/

ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి ఇందులో ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. సినిమా రిలీజ్ త‌ర్వాత క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ALSO READ : https://teluguprabha.net/cinema-news/pawan-kalyan-heroine-ameesha-patel-given-clarity-on-her-marriage/

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad