OG Trailer: పవన్ కళ్యాణ్ (Pawan Kalayan) హీరోగా రూపొందిన లేటెస్ట్ యాక్షన్ మూవీ OG. ఇందులో పవర్ స్టార్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం మేకర్స్ భారీ ఎత్తున ప్రీ రిలీజ్ (OG Pre Release event) ఈవెంట్ ప్లాన్ చేశారు. సినిమాపై ఉన్న అంచనాలను పెంచేలా మూవీ ట్రైలర్‌ను (OG Trailer) ఆదివారం ఉదయం విడుదల చేయటానికి సిద్ధమయ్యారు. అయితే చివరి నిమిషంలో మేకర్స్ ప్లాన్ మారింది.
OG ట్రైలర్‌ని ఆదివారం రాత్రి జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని మేకర్స్ అనౌన్స్ చేశారు. తమకు అభిమానుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో తెలిసినప్పటికీ వాళ్లు కామెడీ టచ్‌తో ట్రైలర్ టైమ్ పోస్ట్ పోన్ అంటూ చెప్పటం కొసమెరుపు. దానికి పవన్ వీడియోనే వాడుకున్నారు మరి.
OG ట్రైలర్ ఫైనల్ కట్ క్లియరెన్స్ పవన్ నుంచి రావాల్సి ఉంది.. ఆయన ఓకే చెబితే దాన్ని ప్రీ రిలీజ్ లో చూపిస్తారట. ట్రైలర్ తర్వాత హంగామా చేద్దామనుకున్న ఫ్యాన్స్‌కి నిరాశే మిగిలింది. అయితే కొన్ని గంటల్లో ఈ నిరీక్షణకు తెరపడనుంది.
పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి విలన్‌గా కనిపించబోతున్నారు. రన్ రాజా రన్, సాహో చిత్రాల ఫేమ్ సుజీత్ మూవీని డైరెక్ట్ చేశారు. సినిమాపై ఉన్న అంచనాలు ట్రైలర్‌తో నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి. సినిమాలో జపాన్ బ్యాక్ డ్రాప్ కూడా మనకు ఉంటుంది. రీసెంట్‌గా జపాన్ భాషలో పవన్ పాడిన పాటను మేకర్స్ విడుదల చేయగా.. తెగ వైరల్ అవుతోంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్..
ఆదివారం సాయంత్రం 5 గంటలకు OG ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తారనే టాక్ అయితే నడుస్తోంది. ఎల్.బి.స్టేడియం వేదికగా జరగబోయే ఈవెంట్‌కు భారీ ఎత్తున్న సన్నాహాలు చేస్తున్నారు. అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. పవన్ వేడుకలో ఏం మాట్లాడబోతున్నారనేది మరింత ఆసక్తికరంగా మారింది.
Also Read- IND vs PAK: సూపర్ 4 అంటే భయపడుతున్న టీమిండియా.. భారత్ తో మ్యాచ్ అంటే వణుకుతున్న పాక్..
ప్రీ రిలీజ్ బిజినెస్
OG మూవీపై ఉన్న అంచనాలతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవర్‌సీస్ కలిపి రూ.175 కోట్ల మేర ముందస్తు బిజినెస్ జరిగింది. సినిమా హిట్ కావాలంటే రూ.300 కోట్లు రావాలని ట్రేడ్ వర్గాలంటున్నాయి. మరి OG బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. డివివి ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు.


