OG: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాలతో సందడి చేయటానికి సిద్ధమవుతున్నారు. ఇన్నాళ్లపాటు పెండింగ్‌లో ఉన్న తన సినిమాలను ఏకధాటిగా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. రాజకీయాల్లో బిజీగా తిరుగుతున్న సమయంలో ఎన్నికల ముందు.. ఆయన స్టార్ట్ చేసిన మూడు సినిమాలు హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu), OG, ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). ఈ మూడింటిలో ఇప్పటికే రెండింటిని పవర్ స్టార్ కంప్లీట్ చేసేశారు. అందులో ముందుగా హరిహర వీరమల్లు సిద్ధమవుతోంది. జూలై 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ మూవీ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తరుణంలో ఫ్యాన్స్ సంబరపడేలా మరో మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ అధికారికంగా బయటకు వచ్చింది. ఆ సినిమా ఏదో కాదు..OG. ఈ మూవీకి సంబంధించిన ఎంటైర్ షూటింగ్‌ను మేకర్స్ పూర్తి చేసినట్లు తెలియజేశారు.
OG మూవీలో పవన్ తన పాత్రకు చెందిన చిత్రీకరణను ఎప్పుడో పూర్తి చేసేశారు. దీంతో మేకర్స్ స్పీడు పెంచి మిగిలిన షూటింగ్‌ను కూడా కంప్లీట్ చేయటం విశేషం. ఎందుకంటే సినిమా రిలీజ్ డేట్ సెప్టెంబర్ 25గా (OG Release date) ఖరారైన సంగతి తెలిసిందే. దసరా సందర్భంగా ఇలా పవన్ సినిమా రానుండటం ఆయన అభిమానులకు ఫెస్టివల్. రన్ రాజా రన్, సాహో చిత్రాల దర్శకుడు, పవన్ అభిమాని అయిన సుజిత్ (Sujith) ఈ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ట్రిపులార్ నిర్మాత డివివి దానయ్య మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో పవన్‌కు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. ఇంకా ఈ మూవీలో అర్జున్ దాస్, శ్రియా రెడ్డిలాంటి నటీనటులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తుంటే బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటిస్తుండటం విశేషం. ఇదే ఆయన తొలి తెలుగు సినిమా కావటం ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో విషయం.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/pooja-hegde-monica-song-released-from-coolie-movie/
జూలై 24న హరిహర వీరమల్లు, మరో రెండు నెలల గ్యాప్‌తో OG రిలీజ్ కానుండటం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. సినిమా ప్రాంభంలో విడుదలైన గ్లింప్స్, నెత్తురకు మరిగిన హంగ్రీ చీతా అనే సాంగ్ సినిమాపై అంచనాలను ఆకాశానికి అంటేలా చేశాయి. ఇక టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను ఇక ఏ రేంజ్‌కు తీసుకెళతాయనేది ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. రానున్న రెండు చిత్రాలతో పవన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయటం పక్కా అని ట్రేడ్ వర్గాలంటున్నాయి.


