PSPK Birthday: టాలీవుడ్ హీరో, ఏపీ డిప్యూటీ సీఏం పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా మంగళవారం ఆయనకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రతేకంగా విషెస్ చెప్పారు. తమ్ముడిని ఉద్దేశిస్తూ చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా,
ప్రజా జీవితంలో జనసేనాని గా,
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు.ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం.
ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు… pic.twitter.com/13gaXFpWsG— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2025
‘చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనానిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన ఓ పాత ఫొటోను చిరంజీవి పోస్ట్ చేశారు. ఈ ఫొటో మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఫొటో షేర్ చేసిన బన్నీ..
పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఓ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు బన్నీ. ‘మన పవర్ స్టార్, డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ ఓ పోస్ట్ పెట్టారు. అల్లు అర్జున్ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
Heartfelt Birthday Wishes to our Powerstar & Deputy CM @PawanKalyan garu pic.twitter.com/JGfBN1eU3M
— Allu Arjun (@alluarjun) September 2, 2025
నా గురువు…
పవన్ కళ్యాణ్‌ను తన గురువుగా పేర్కొంటూ మెగా హీరో సాయిధరమ్‌తేజ్.. మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. నాకు పట్టుదల నేర్పించి, నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన నా గురువుకు జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే కళ్యాణ్ మామ అంటూ సాయిధరమ్‌తేజ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
స్పెషల్ పోస్టర్స్..
మరోవైపు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీతో పాటు ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలు చేస్తున్నారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓజీ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. సాహో ఫేమ్ సుజీత్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఉస్తాగ్ భగత్‌సింగ్ సినిమాకు హరీష్ శంకర్ డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.
Also Read- Pawan Kalyan Songs: పవన్ కళ్యాణ్ పాడిన చార్ట్ బస్టర్ సాంగ్స్..


