ఏపీ సీఎం పవన్ కళ్యాణ్.. కార్యాలయం నుంచి విడుదలైన ప్రెస్ నోట్.. ఇటు రాజకీయాల్లోనూ.. అటు సినీ రంగంలోనూ తీవ్ర చర్చనీయాంసమైంది. తెలుగు సినిమా పరిశ్రమ తరఫున వచ్చిన రిటర్న్ గిఫ్ట్ బాగుంది అంటూ.. పవన్ చేసిన వ్యాఖ్యలు చేశారు. ఈ లేఖలో పవన్, గతంలో టాలీవుడ్ నుంచి వచ్చిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఇప్పటిదాకా పరిశ్రమ తరపున ఎవరూ మర్యాదపూర్వకంగా కలవకపోవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇది పరిశ్రమ పట్ల ప్రభుత్వం చూసే దృష్టికోణాన్ని ప్రభావితం చేసే అంశమని చెప్పడంలో ఆయన ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ సమస్యైనా, విజ్ఞప్తైనా వ్యక్తిగతంగా కాకుండా… కేవలం అధికారిక సినీ అసోసియేషన్ల ద్వారానే మాట్లాడాలని పవన్ తేల్చి చెప్పేశారు. అంటే ఇక నుంచి డైరెక్టర్లు, నిర్మాతలు ఏ వ్యక్తిగత అవసరానికైనా పవన్‌ను కలవాలంటే అది సాధ్యపడదు. ఆయన అధికారికంగా వ్యక్తిగత అపాయింట్మెంట్లు ఇవ్వబోరన్న స్పష్టం చేశారు.
పన్నులు, థియేటర్ల ఆదాయం, టికెట్ రేట్లు, మల్టీప్లెక్స్ వ్యాపారాల్లో ఉన్న లోపాలు, వీటిపై ఏర్పడుతున్న వివాదాలు, పరిశ్రమలో కొనసాగుతున్న గుత్తాధిపత్యం వంటి అంశాలపై సమీక్షలు జరపబోతున్నట్టు ఈ లేఖలో వివరంగా పేర్కొన్నారు. ఇది పరిశ్రమలోని అనేక మందిలో గందరగోళానికి కారణమవుతోంది. ప్రస్తుతం ఈ లేఖ తాలూకు ప్రభావం ఎలా ఉంటుందన్న ప్రశ్న టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. పరిశ్రమపై ప్రభుత్వం దృష్టి పెట్టడమా.. లేక పాతవాళ్ల తీరుపై ఆగ్రహమా.. అనే చర్చ నడుస్తోంది.