Saturday, November 15, 2025
HomeTop StoriesOG Movie : ‘ఓజీ’ ప్రీమియర్‌ షోలో ఊహించ‌ని ఘ‌ట‌న.. కత్తితో స్క్రీన్ చింపేసిన...

OG Movie : ‘ఓజీ’ ప్రీమియర్‌ షోలో ఊహించ‌ని ఘ‌ట‌న.. కత్తితో స్క్రీన్ చింపేసిన అభిమానులు!

Pawan Kalyan fans vandalize theater screen: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం ‘ఓజీ’ నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి.. బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతుంది. అయితే బెంగళూరులో బుధ‌వారం జ‌రిగిన‌ ‘ఓజీ’ ప్రీమియర్‌ షోలో ఓ ఉహించ‌ని ఘ‌ట‌న చోటుచేసుకుంది. సినిమా ప్రీమియ‌ర్‌ చూస్తూ.. అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించాడు. థియేటర్‌లో వీరంగం సృష్టించిన కొందరు కుర్రకారులు.. ఏకంగా స్క్రీన్‌ను ధ్వంసం చేశారు.

- Advertisement -

పెద్ద ఎత్తున నినాదాలు: బెంగళూరులోని కే.ఆర్. పురం ప్రాంతంలో ఉన్న థియేటర్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు వీరంగం సృష్టించారు. ‘ఓజీ’ ప్రీమియర్ షో ప్రారంభమైన తర్వాత కొందరు కుర్రకారులు తమ అభిమానాన్ని ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో కొందరు అభిమానులు అత్యుత్సాహంతో రెచ్చిపోయి.. కత్తితో థియేటర్ స్క్రీన్‌ను చింపివేశారు. స్క్రీన్‌పై పెద్ద పగుళ్లు వచ్చాయి. దీంతో థియేటర్ యాజమాన్యం తక్షణమే షోను రద్దు చేసింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు చేసిన వీరంగానికి షో రద్దు కావడంతో.. సినిమా చూడడానికి వచ్చిన పవన్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

సహజమే అయినప్పటికీ: పెద్ద హీరోల సినిమా విడుదలైనప్పుడు అభిమానులు తమ ఆనందాన్ని పంచుకోవడం సహజమే అయినప్పటికీ .. ఈ విధంగా ఆస్తి నష్టం కలిగించడం సరికాదని థియేటర్ యాజమాన్యం అన్నారు. తోటి ప్రేక్షకులు ఇబ్బందికి గురైయ్యారని తెలిపారు. దీంతో సినిమా అభిమానులు.. పవన్ ఫ్యాన్స్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి చర్యలు చిత్ర పరిశ్రమకు, ప్రేక్షకులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని అభిప్రాయపడుతున్నారు.

ఎలివేషన్స్‌తో మెరిసిన స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామా: మోస్ట్-అవైటెడ్ గ్యాంగ్‌స్టర్ చిత్రం ‘ఓజీ’ పవర్ స్టార్‌ అభిమానుల అంచనాలను అందుకుంది. పవన్ కల్యాణ్‌ వీరాభిమాని అయిన దర్శకుడు సుజీత్‌ ఈ సినిమాని పూర్తిగా ‘ఫ్యాన్ బాయ్ మూమెంట్స్‌’తో నింపేశాడు. అడుగడుగునా క్లైమాక్స్‌ని మించిపోయే ఎలివేషన్స్‌తో ఓ అగ్ని తుఫాన్‌ను తెరపై ఆవిష్కరించారు. ‘ఓజీ’ పూర్తిగా పవన్‌కల్యాణ్‌ ఇమేజ్‌కి మరియు ఆయన స్వాగ్‌కి తగ్గట్టుగా రూపొందించిన సినిమా. దర్శకుడు సుజీత్ ప్రతి ఫ్రేమ్‌ను స్టైలిష్‌గానే కాకుండా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు. ఆరంభంలో జపాన్‌లోని యకుజా, సమురాయ్ వంశాలతో మొదలయ్యే కథ ప్రేక్షకుడిని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆ తర్వాత ముంబైకి మారగానే పవన్‌కల్యాణ్‌ పరిచయ సన్నివేశాల నుంచి ఎలివేషన్స్ హంగామా మొదలవుతుంది. ముంబై అండర్‌వరల్డ్‌ను గడగడలాడించిన ఓజీ గతం, పదేళ్ల తర్వాత తిరిగి వచ్చిన సన్నివేశాలతోపాటుగా యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాపై బలమైన ముద్ర వేశాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad