OG Collections: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘OG’ (They Call Him OG’ (ఓజీ) బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ విషయంలో రికార్డు సృష్టిస్తూ తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల నెట్ మార్క్‌ను దాటి సరికొత్త బెంచ్‌మార్క్‌లను నెలకొల్పిందని ట్రేడ్ వర్గాలంటున్నాయి.
రికార్డుల వేట..
OG రికార్డు స్థాయి ఓపెనింగ్ డే కలెక్షన్లతో మొదలైంది. తొలి రోజున ఈ చిత్రం మన దగ్గర అన్ని భాషలలో అంచనా ప్రకారం రూ.84.75 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇక రెండవ రోజున అయిన శుక్రవారం నాడు అంచనాల ప్రకారం ఈ చిత్రం సుమారు రూ. 19.25 కోట్ల (OG Day 2 collections) నెట్‌ను వసూలు చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల మైలురాయిని దాటింది. దీంతో పవన్ కళ్యాణ్ కెరీర్‌లో భారతదేశంలో రూ.100 కోట్ల నెట్ క్లబ్‌లోకి అత్యంత వేగంగా ఎంట్రీ ఇచ్చిన చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా ఆయన కెరీర్‌లో ఈ మైలురాయిని సాధించిన రెండవ చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే రూ.85.07 కోట్లు వసూలు చేసిన మిరాయ్ (Mirai Movie collections) చిత్రం యొక్క మొత్తం 15 రోజుల కలెక్షన్లను అధిగమించడం విశేషం.
తెలుగు రాష్ట్రాల ఆక్యుపెన్సీ..
‘ఓజీ’ మూవీ తెలుగు రాష్ట్రాలలో స్థిరమైన వృద్ధిని కొనసాగించింది. శుక్రవారం రోజున ఈ చిత్రం మొత్తం 41.57 శాతం ఆక్యుపెన్సీని టచ్ చేసింది. ఇది సెకండ్ షోస్ సమయానికి పెరిగింది. ట్రేడ్ సమాచారం మేరకు 50 శాతానికి పైగా ఆక్యుపెన్సీ పెరగటం విశేషం.
Also Read – Ananya Nagalla: బతుకమ్మ సంబరాల్లో అనన్య.. ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టిందిగా..
ఓవర్సీస్‌లో కొత్త రికార్డ్స్..
ఓజీ కలెక్షన్స్ సునామీ ఇండియాకే పరిమితం కాలేదు. ఓవర్సీస్ మార్కెట్లలో కూడా ఈ చిత్రం సరికొత్త బెంచ్‌మార్క్‌లను క్రియేట్ చేస్తోంది. యు.ఎస్‌లో ఓజీ మూవీ $3.61 (OG Overseas collections) మిలియన్లకు పైగా వసూలు చేసింది. దీంతో ఓవర్సీస్ ప్రీమియర్ షోస్, తొలి రెండు రోజలు వసూళ్ల విషయంలో పవన్ కళ్యాణ్ కెరీర్లోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
పవన్ కళ్యాణ్‌ను ఎలాంటి రోల్‌లో ఆడియెన్స్ చూడాలనున్నారో అలాంటి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించాడు. అభిమానిగా సుజీత్ పవర్‌స్టార్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూపించిన విధానానికి అందరూ ఫిదా అవుతున్నారు. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్‌లో సినిమా తెరకెక్కింది. ఓజీతో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి (Emraan Hasmi) టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan)కథానాయికగా నటించింది. ప్రకాష్ రాజ్, జాకీ ష్రాఫ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో మెప్పించారు. తమన్ అందించిన మ్యూజిక్ సినిమా సక్సెస్‌లో మేజర్ పార్ట్‌ను పోషించింది.
Also Read – Tomatoes price: కిలో టమాటా @ రూ.1.. ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు!


