Wednesday, May 14, 2025
Homeచిత్ర ప్రభPawan Kalyan : ఫ్యాన్స్ పండగ చేసుకోండి.. ఉస్తాద్ భగత్ సింగ్ లో సైనికుడిగా పవన్...

Pawan Kalyan : ఫ్యాన్స్ పండగ చేసుకోండి.. ఉస్తాద్ భగత్ సింగ్ లో సైనికుడిగా పవన్ కళ్యాణ్..!

పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నారు. ఒక వైపు తన పని చేస్తూనే తన అభిమానులకు మాత్రం సినిమా విందు అందించేందుకు సన్నద్ధమవుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్, తన భవిష్యత్‌ సినిమా ప్లాన్స్‌ గురించి ఓ మేజర్ అప్‌డేట్ ఇచ్చారని సోషల్ మీడియా వర్గాల్లో వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్ర షూటింగ్ ఈ ఏడాది జూన్ 12న తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని టాక్. ఈ సినిమాలో పవన్ ఒక ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. “ఆపరేషన్ సింధూర్” అనే ఫిక్షనల్ మిలిటరీ బ్యాక్‌డ్రాప్‌లో కథ కొనసాగనుందని, అందులో దేశభక్తి, సేవా తత్పరత, మాస్ యాక్షన్ మిక్స్ అవుతాయని ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

పవన్.. హరీష్ శంకర్ కాంబినేషన్ అంటేనే భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో ‘గబ్బర్ సింగ్’తో బ్లాక్‌బస్టర్ ఇచ్చిన ఈ జోడీ మళ్లీ కలిసి పనిచేయడం సినిమాపై హైప్ పెంచింది. మొదట్లో తమిళ హిట్ ఫిల్మ్ ‘తేరి’కి రీమేక్‌గా మొదలైన ప్రాజెక్ట్, ప్రస్తుతం పూర్తిగా ఓ ఒరిజినల్ స్క్రిప్ట్‌గా మారిందట. దర్శకుడు హరీష్ శంకర్ ఇందులో రాజకీయ, సామాజిక అంశాలు, మిలిటరీ హీరొయిజం అన్నింటినీ మేళవిస్తూ పవన్ పాత్రను డిజైన్ చేస్తున్నాడని సమాచారం.

ఈ సినిమాలో పవన్ మిలిటరీ ఆఫీసర్‌గా ఉండటం తో పాటు, అతని పాత్రలో జనసేన నాయకుని లక్షణాలు, ప్రజల పట్ల బాధ్యతబోధ, శత్రువులను ఎదుర్కొనే ధైర్యం కనిపించనున్నట్లు సమాచారం. పవన్ శైలి డైలాగ్స్, మాస్ ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లతో సినిమా పూర్తి స్థాయి పౌరుషభరితంగా ఉండబోతోందట. కేవలం కమర్షియల్ అంశాలే కాదు, ఇందులో భావోద్వేగాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంటుందని వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం, అన్ని వర్క్‌లు డిసెంబర్ 2025లో పూర్తి చేసి 2026 సంక్రాంతికి థియేటర్లలో విడుదల చేయాలని యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పవన్ అభిమానులు థియేటర్ల వద్ద మరోసారి సంబరాలు చేసుకునే రోజులు దగ్గరపడ్డాయన్న మాట.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News