Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ పీరియాడికల్ డ్రామాకు సెన్సార్ బోర్డు నుంచి ‘యు/ఏ’ సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమా మొత్తం 162 నిమిషాల (రెండు గంటల 42 నిమిషాలు) రన్ టైమ్‌తో ఫైనల్ వెర్షన్‌ను లాక్ చేశారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ వివరాలు నేడు, జూలై 14, 2025న విడుదలయ్యాయి.
ఎ.ఎం. రత్నం సమర్పణలో, మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. ఎ.ఎం. జ్యోతి కృష్ణ ఈ పీరియాడికల్ డ్రామాకు దర్శకత్వం వహించారు. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ‘హరిహర వీరమల్లు’ థియేట్రికల్ ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
Also Read – Jio Recharge Plan: జియో రీచార్జ్ ప్లాన్..రోజుకి 2జీబీ డేటా, ఉచితంగా అమెజాన్ ప్రైమ్..
హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమాను వీక్షించిన సెన్సార్ టీమ్ చిత్ర బృందానికి ప్రశంసలు అందించింది. చారిత్రక నేపధ్యాన్ని చాలా చక్కగా చూపించారని దర్శకుడిని అభినందించారని సమాచారం. సెన్సార్ టీమ్ నుండి వచ్చిన ఈ ప్రశంసలు, సినిమాపై యూనిట్ పెట్టుకున్న నమ్మకాన్ని మరింత రెట్టింపు చేశాయి. చాలా కాలంగా పవర్ స్టార్ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఆయన అభిమానులకు ‘హరిహర వీరమల్లు’ ఒక పండుగలా ఉండబోతుందని యూనిట్ బలంగా నమ్ముతోంది.
ఈ చిత్రం ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో, చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 20న వైజాగ్ వేదికగా ‘హరిహర వీరమల్లు’ ప్రీ-రిలీజ్ వేడుకను (HHVM Pre Release Event) నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా రానున్నారని తెలుస్తోంది. రాజమౌళి రాకతో ఈవెంట్‌కు మరింత గ్లామర్ వచ్చి, సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమాను పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
Also Read – White Rice: ప్రతిరోజు వైట్ రైస్ తింటే శరీరంలో జరిగేది ఇదే..
సనాతన ధర్మాన్ని కాపాడటానికి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును ఎదిరించే వీరుడి పాత్రలో పవన్ కళ్యాణ్ నటించారు. ఇది ఫిక్షనల్ రోల్. వపన్, డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అవుతోన్న సినిమా కావటంతో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటించారు.


