HHVM Creates Premiere Record: బాక్సాఫీస్ వద్ద హరిహర వీరమల్లు హవా కొనసాగుతోంది. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ హిస్టారికల్ మూవీ తెలుగు రాష్ట్రాలతో ఓవర్‌సీస్‌లో హౌజ్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. పెయిడ్ ప్రీమియర్స్‌లోనూ అదరగొట్టిన హరిహర వీరమల్లు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది.
యాక్టింగ్ అదుర్స్..
హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ యాక్టింగ్‌తో పాటు ఆయనపై తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులను మెప్పిస్తున్నాయి. వీరమల్లు పాత్రలో పవన్ మ్యానరిజమ్స్, డైలాగ్ డెలివరీకి ఫ్యాన్స్ ఫిదా అవుతోన్నారు. వీరమల్లు ప్రభంజనంతో థియేటర్లు ఉగిపోతున్నాయి. పక్కా పైసా వసూల్ మూవీ ఇదని అంటున్నారు. సనాతన ధర్మ కాన్సెప్ట్‌ను సినిమాలో అద్భుతంగా చూపించారని ప్రేక్షకులు చెబుతోన్నారు. కాన్సెప్ట్, బీజీఎమ్, సాంగ్స్ బాగున్నాయని అంటున్నారు.
Also Read – Hyper Aadi: హరిహర వీరమల్లుపై హైపర్ ఆది అదిరిపోయే రివ్యూ.. ఏం చెప్పాడంటే?
30 కోట్ల కలెక్షన్స్…
తెలుగు రాష్ట్రాల్లో 750 స్క్రీన్స్‌లో ఓవర్‌సీస్‌లో 3500 స్క్రీన్స్‌లో హరిహర వీరమల్లు రిలీజైంది. అన్ని చోట్ల టాక్ బాగుంది. థియేటర్లలో అభిమానుల సంబరాల తాలూకు వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. కాగా పెయిడ్ ప్రీమియర్స్ కలెక్షన్స్‌లో పవన్ కళ్యాణ్ మూవీ సరికొత్త రికార్డును క్రియేట్ చేసినట్లు చెబుతోన్నారు. ప్రీమియర్స్ ద్వారా ఈ మూవీ దాదాపు 30 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. ప్రీమియర్స్ కలెక్షన్స్‌లో టాలీవుడ్‌లో ఇదే హయ్యెస్ట్ అని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్…
పెయిడ్ ప్రీమియర్స్‌కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఫస్ట్ డే కలెక్షన్స్‌లో హరిహర వీరమల్లు టాలీవుడ్ రికార్డులు తిరగరాయడం ఖాయంగానే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న మూవీగా హరిహర వీరమల్లు నిలవనున్నట్లు చెబుతోన్నారు.
Also Read – Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ మరో హరిహరవీరమల్లు కానుందా? – పవన్ ఫ్యాన్స్ టెన్షన్?
థియేటర్లలో హరిహర వీరమల్లుకు వస్తోన్న స్పందన పట్ల నిర్మాత ఏఎమ్‌రత్నంతో పాటు దర్శకుడు జ్యోతికృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. మంచి కాన్సెప్ట్‌తో పాటు వైవిధ్యతను నమ్మి సినిమా చేస్తే పెద్ద విజయాన్ని అందుకోవచ్చని హరిహర వీరమల్లు సక్సెస్ నిరూపించిందని తెలిపారు. హరిహర వీరమల్లుతో తమకు అద్భుత విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. హరిహర వీరమల్లు మూవీకి క్రిష్‌తో కలిసి ఏఎమ్ జ్యోతికృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ నటుడు బాబీడియోల్ విలన్‌గా నటించాడు.


