Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభHariHara Veeramallu : రామోజీ ఫిలిం సిటీలో పవన్ కళ్యాణ్.. యాక్షన్ షురూ..

HariHara Veeramallu : రామోజీ ఫిలిం సిటీలో పవన్ కళ్యాణ్.. యాక్షన్ షురూ..

- Advertisement -

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అటు పాలిటిక్స్, ఇటు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఎలక్షన్స్ కి టైం దగ్గర పడుతుండటంతో పాలిటిక్స్ కి ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. దీంతో పవన్ సినిమాలు ఆగిపోయాయి. ఈ విషయంలో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

పవన్ చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నా ప్రస్తుతం ఒక్కటే సెట్స్ మీద ఉంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా రెండేళ్ల క్రితం మొదలైంది. కానీ కరోనా కారణాల వల్ల, పవన్ రాజకీయ షెడ్యూల్స్ వల్ల ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తుంది. ఇప్పటివరకు కేవలం 30 శాతం షూటింగ్ మాత్రమే జరిగినట్టు సమాచారం.

ఇటీవల వర్క్ షాప్స్ జరగడంతో ప్రాజెక్టు పరిగెడుతుంది అనుకున్నారు. కానీ మళ్ళీ పవన్ రాజకీయాలకి టైం ఇవ్వాల్సి రావడంతో వాయిదా పడింది. తాజాగా హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ని రామోజీ ఫిలిం సిటీలో మొదలుపెట్టారు. దర్శకుడు హరీష్ శంకర్ షూటింగ్ స్పాట్ నుంచి డైరెక్టర్ క్రిష్ ఫోటోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హరిహర వీరమల్లు యాక్షన్ సీక్వెన్స్ మొదలయ్యాయి అని తెలిపాడు. మరి ఈ సారన్నా కంటిన్యూగా సినిమా షూట్ జరుగుతుందా లేదా మళ్ళీ పవన్ షూట్ ఆపేసి రాజకీయాలు అంటూ వెళ్తారా చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad