Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభAmeesha Patel Marriage: అత‌న్ని ప్రేమించాను.. ఆ పని వ‌ద్ద‌న్నాడు.. అందుకే పెళ్లి చేసుకోలేదు.. ప‌వ‌న్...

Ameesha Patel Marriage: అత‌న్ని ప్రేమించాను.. ఆ పని వ‌ద్ద‌న్నాడు.. అందుకే పెళ్లి చేసుకోలేదు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోయిన్ క్లారిటీ

Ameesha Patel Marriage: బాలీవుడ్ హీరోయిన్ అమీషా ప‌టేల్ గురించిన ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. క‌హోనా ప్యార్ హై మూవీతో త‌న కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ‌, కుర్ర‌కారు గుండెల్ని కొల్ల‌గొట్టింది. త‌ర్వాత తెలుగులోనూ సినిమాలు చేసింది. హిందీలో కెరీర్ స్టార్ట్ చేసిన‌ప్పుడే తెలుగు సినిమా చేయ‌టం విశేషం. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా న‌టించిన బ‌ద్రి (Badri) సినిమాలో అమీషా ప‌టేల్ క‌థానాయిక‌గా మెప్పించింది. తెలుగులో త‌ర్వాత మ‌హేష్ (Mahesh Babu) హీరోగా న‌టించిన నాని (Nani), ఎన్టీఆర్‌తో న‌ర‌సింహుడు (Narasimhudu), నంద‌మూరి బాల‌కృష్ణ‌తో ప‌ర‌మ వీర‌చ‌క్ర (Parama VeeraChakra) సినిమాలో న‌టించింది. త‌మిళంలోనూ యాక్ట్ చేసింది.

- Advertisement -

ఇలా నార్త్‌తో పాటు సౌత్‌లోనూ సినిమాలు చేసిన అమీషా ప‌టేల్‌ ఐదు ప‌దుల వ‌య‌సు అవుతున్న‌ప్ప‌టికీ, ఇంకా పెళ్లి చేసుకోక‌పోవ‌టం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. సాధార‌ణంగా నార్త్‌లో హీరోయిన్స్‌కి ప్రేమాయ‌ణాలు ఎక్కువ‌గానే ఉంటాయి. అయితే చాలా త‌క్కువ మంది మాత్ర‌మే ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. అలాంటి వారిలో ఇప్పుడు అమీషా ప‌టేల్ చేరుతోంద‌ని బాలీవుడ్ వ‌ర్గాలంటున్నాయి. చెక్ బౌన్స్ కేసు అని, మోసం చేసిన కేసు.. అంటూ ఒడిదొడుకుల‌ను కూడా ఆమె ఫేస్ చేసింది. ఇక ఆమె కెరీర్ అయిపోయింద‌ని అంద‌రూ అనుకుంటున్న త‌రుణంలో గ‌ద్ద‌ర్ 2తో (Gaddar 2) రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ ఇవ్వ‌ట‌మే కాదండోయ్‌.. మంచి హిట్‌ను త‌న ఖాతాలో వేసుకోవ‌టం కొస మెరుపు.

Also Read – Bigg Boss: డీమాన్ కెప్టెన్ అయ్యాడు.. నా రీతూ నన్ను పట్టించుకోవట్లేదు.. కన్నీళ్లు పెట్టుకున్న ఇమ్మూ

ఇలాంటి త‌రుణంలో అమీషా ప‌టేల్ అస‌లు ఎందుకు పెళ్లి చేసుకోలేదు (Ammesha Patel Marriage).. అనే దాని మీద ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్న‌గా ఆమెకు ఎదురైంది. అయితే ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌టానికి ఆమె ఏమాత్రం త‌డ‌బ‌డ‌లేదు. అస‌లు తానెందుకు పెళ్లి చేసుకోలేదు అనే దానిపై ఆమె స‌మాధానం చెప్పింది. ‘పెళ్లి చేసుకోక‌పోవ‌టం నాకు ఇష్టం లేక కాదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి నాకు చాలా పెళ్లి సంబంధాలు వ‌చ్చాయి. అయితే వ‌చ్చిన వారందరూ పెళ్లి త‌ర్వాత సినిమాలు చేయ‌కూడ‌దు అని కండీష‌న్ పెట్టారు. అది నాకు న‌చ్చ‌లేదు. అందుక‌నే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాను. సాధార‌ణంగా పెళ్లి చేసుకునే వ్య‌క్తి జీవితంలో మ‌న ఎదుగుద‌ల‌ను కోరుకోవాలే త‌ప్ప‌, వెనక్కి లాగ‌కూడ‌దు. గ‌తంలో నేను ఒక వ్య‌క్తిని ప్రేమించాను. త‌నేమో పెళ్లి త‌ర్వాత సినిమాలు మానేయాలని అన్నాడు. కెరీర్ కోసం ఎన్నింటినో త్యాగం చేశాను. అలాంటిది కెరీర్‌ను వ‌దులుకోవాలంటే క‌ష్టంగా అనిపించింది. అందుక‌నే ప్రేమ‌ను వ‌దిలేసుకున్నాను. నన్ను అర్థం చేసుకునేవాడు.. త‌గిన‌వాడు అనిపిస్తే పెళ్లి చేసుకోవ‌టానికి నేను సిద్ధ‌మే’ అంటూ చెప్పుకొచ్చింది అమీషా ప‌టేల్‌.

2023లో స‌న్నీడియోల్‌తో (Sunny Deol) ఆమె న‌టించిన గ‌ద్ద‌ర్ 2 మూవీ త‌ర్వాత మ‌రుస‌టి ఏడాది తౌబా తేరా జల్వా (Tauba Tera Jalwa) సినిమాలో న‌టించింది. త‌ర్వాత మ‌రే సినిమాలోనూ ఆమె క‌నిపించ‌లేదు. మ‌రిప్పుడు, ఈ వ‌య‌సులో సినిమాల్లో అవ‌కాశం అంటే మామూలు విష‌యం కాదు. కెరీర్ ప‌రంగా ఈ ప‌రిస్థితి అమీషా ప‌టేల్ ఎలా అధిగ‌మిస్తుందో చూడాలి మ‌రి.

Also Read – Bigg Boss: రీతూని నెట్టేసిన ఇమ్మాన్యుయెల్.. కమెడియన్ డైరెక్ట్ ఎలిమినేట్.. కెప్టెన్సీ టాస్క్ లో రచ్చ రచ్చ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad