Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభPawan-Balayya : వీరమల్లుతో వీరసింహారెడ్డి.. సినీ, రాజకీయాల్లో చర్చ..

Pawan-Balayya : వీరమల్లుతో వీరసింహారెడ్డి.. సినీ, రాజకీయాల్లో చర్చ..

- Advertisement -

Pawan-Balayya : బాలకృష్ణ ఓ పక్క అన్ స్టాపబుల్ షోతో, సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో రాబోతున్నాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో, పాలిటిక్స్ తో బిజీగా ఉన్నాడు. వీరిద్దరూ కలవడం అనేది చాలా రేర్. కానీ అన్‌స్టాపబుల్ షోకి పవన్ కళ్యాణ్ వస్తారని వార్త ఇటీవల బాగా వినిపిస్తుంది. అయితే వచ్చేంతవరకు నమ్మకం లేదు.

తాజాగా పవన్ కళ్యాణ్ బాలయ్యని కలిసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. వీరసింహారెడ్డి షూట్ లో పవన్ కళ్యాణ్ బాలయ్యని, చిత్ర యూనిట్ ని కలిసి కాసేపు మాట్లాడారు. చిత్రయూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. వీరసింహారెడ్డి సినిమాలోని సాంగ్ షూట్ జరుగుతున్న సమయంలో పవన్ వెళ్లారు. పవన్ తో పాటు డైరెక్టర్ క్రిష్ కూడా వెళ్లారు. వీరసింహారెడ్డి చిత్ర యూనిట్ మొత్తం ఉన్నారు. దీంతో బాలయ్యని పవన్ కలిసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీరిద్దరి కలయిక అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయాల్లోనూ చర్చకి దారి తీసింది. మాములుగా కలిస్తేనే ఇంత బాగా వైరల్ అవుతుందంటే ఇక అన్ స్టాపబుల్ షోకి వస్తే రచ్చే అంటున్నారు అభిమానులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad