OG Advance Bookings: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓజీ మేనియా నడుస్తోంది. ఫ్యాన్స్ మాత్రమే కాదు.. తెలుగు హీరోలు సైతం ఓజీ కోసం ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ గ్యాంగ్‌స్టర్ మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్‌కు అనుమతులు లభించాయి. రిలీజ్‌కు ఓ రోజు ముందుగానే సెప్టెంబర్ 24 నుంచి ఓజీ హవా మొదలుకానుంది.
యాభై కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్…
రిలీజ్‌కు ముందే ఓజీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ యాభై కోట్లు దాటాయి. ఓవర్‌సీస్‌లో మూడు మిలియన్లు (దాదాపు ఇరవై ఏడు కోట్లు) వరకు ఈ సినిమా ప్రీ సేల్స్ జరిగాయి. ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ 23 కోట్లు దాటాయి. మొత్తంగా రిలీజ్‌కు రెండు రోజుల ముందే యాభై కోట్ల మైలురాయిని ఈ మూవీ చేరుకుంది. ఇప్పటివరకు ఇండియా వైడ్‌గా మూడు లక్షల యాభై ఆరు వేల టికెట్లు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
Also Read- Ramgopal Varma: చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో సినిమా – ఆర్‌జీవీ పోస్ట్ వైరల్
ఫస్ట్ మూవీ…
పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే యాభై కోట్లకుపైగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగిన ఫస్ట్ మూవీగా ఓజీ నిలిచింది. ఓవర్‌సీస్‌లో ట్రైలర్ రిలీజ్ కాకుండానే రెండు మిలియన్లకు పైగా ప్రీ సేల్స్ పూర్తిచేసుకున్న ఫస్ట్ తెలుగు మూవీగా కూడా ఓజీ చరిత్రను తిరగరాసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగళూరు, చెన్నై వంటి సిటీస్‌లోనూ ఓజీ జోష్ కనిపిస్తోంది. బెంగళూరులో బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్ది నిమిషాల్లోనే నలభై వేల వరకు టికెట్లు అమ్ముడుపోయాయి. తక్కువ టైమ్‌లో నలభై వేల టికెట్ల బుకింగ్స్‌ను పూర్తిచేసుకున్న తెలుగు మూవీగా ఓజీ నిలిచింది. స్ట్రెయిట్ సినిమాలకు ధీటుగా బుకింగ్స్ జరుగుతోన్నాయి. సినిమాపై ఉన్న బజ్ చూస్తుంటే ఫస్ట్ డే ఓజీ మూవీ రూ. 100 నుంచి 150 కోట్ల వరకు కలెక్షన్స్‌ను రాబట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.
ఆరేళ్ల తర్వాత…
ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా మూవీకి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాహో తర్వాత సినిమాలకు ఆరేళ్ల పాటు బ్రేక్ తీసుకున్న సుజీత్, ఓజీ మూవీతో రీఎంట్రీ ఇస్తున్నాడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాడు. ఓజీ మూవీతో బాలీవుడ్ నటుడు ఇమ్మాన్ హష్మీ టాలీవుడ్‌లోకి విలన్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Also Read- Avika Gor: చిన్నారి ‘పెళ్లి’ కూతురు డేట్ చెప్పేసింది..


