Sunday, November 16, 2025
HomeTop StoriesPawan Kalyan: 12 ఏళ్ల త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రేర్ ఫీట్ - టాలీవుడ్‌లో ఈ...

Pawan Kalyan: 12 ఏళ్ల త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రేర్ ఫీట్ – టాలీవుడ్‌లో ఈ ఏడాది క‌లెక్ష‌న్స్‌లో ఓజీ టాప్‌

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఓజీ మూవీ క‌లెక్ష‌న్స్‌లో అద‌ర‌గొడుతోంది. రిలీజై రెండు వారాలు అవుతోన్న థియేట‌ర్ల‌లో ఓజీ హ‌వా ఏ మాత్రం త‌గ్గ‌లేదు. పోటీగా పెద్ద సినిమాలు ఏవి లేక‌పోవ‌డం కూడా ఓజీకి క‌లిసివ‌చ్చింది.
ఇప్ప‌టికే బాక్సాఫీస్ వ‌ద్ద ప‌లు రికార్డులు బ్రేక్ చేసిన ఓజీ మూవీ మ‌రో మైల్‌స్టోన్ చేరుకుంది. 2025లో హ‌య్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. నిన్న‌టివ‌ర‌కు 275 కోట్ల క‌లెక్ష‌న్స్‌లో ఈ లిస్ట్‌లో సంక్రాంతికి వ‌స్తున్నాం నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో నిలిచింది. వెంక‌టేష్ రికార్డును ఆదివారం నాటితో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ బ్రేక్ చేసింది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. 2025 అత్య‌ధిక వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న మూవీగా ఓజీ టాప్ ప్లేస్‌లో నిలిచిన‌ట్లు పేర్కొన్నారు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా 12 రోజుల్లో ఈ మూవీ 290 కోట్ల వ‌ర‌కు గ్రాస్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

అత్తారింటికి దారేది త‌ర్వాత‌…
టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద ఓ ఇయ‌ర్‌లో హ‌య్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా నిలిచి 12 ఏళ్లు అవుతోంది. చివ‌ర‌గా అత్తారింటికి దారిదేతో ఈ రికార్డును సాధించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో 2013లో రిలీజైన అత్తారింటికి దారేది ఆ ఏడాది హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న తెలుగు సినిమాగా నిలిచింది. అంత‌కుముందు గ‌బ్బ‌ర్‌సింగ్ ఈ ఘ‌న‌త‌ను సాధించింది. ప‌వ‌న్ కెరీర్‌లో మొత్తంగా గ‌బ్బ‌ర్‌సింగ్‌, అత్తారింటికి దారేదితో పాటు ఓజీ మాత్ర‌మే ఈ రేర్ ఫీట్‌ను సాధించాయి. ఈ ఏడాది అఖండ 2 మిన‌హా పెద్ద సినిమాలేవి ఈ మూడు నెల‌ల్లో రిలీజ్ కావ‌డం లేదు. దాంతో ప‌వ‌న్ కెరీర్ బ్రేక్ అయ్యే ఛాన్స్ క‌నిపించ‌డం లేదు.

Also Read – PRABHAS: ‘స్పిరిట్’లో మెగా ట్విస్ట్! విలన్‌గా పాత బాలీవుడ్ హీరో, తండ్రిగా చిరంజీవి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్‌…
కాగా ఆదివారం నాటి క‌లెక్ష‌న్స్‌తో ఓజీ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకున్న‌ట్లు స‌మాచారం. సండే రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ 4.75 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను సొంతం చేసుకున్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టికే ఓవ‌ర్‌సీస్‌లో ఓజీ లాభాల్లోకి అడుగుపెట్టింది. లాంగ్ ర‌న్‌లో నిర్మాత‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ మూవీ భారీగానే లాభాల‌ను మిగిల్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఓజ‌స్ గంభీర‌…
గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ డ్రామాగా డైరెక్ట‌ర్ సుజీత్ ఓజీ మూవీని తెర‌కెక్కించారు. ఈ సినిమాలో ఓజ‌స్ గంభీర పాత్ర‌లో ప‌వ‌న్ యాక్టింగ్‌, హీరోయిజం, ఎలివేష‌న్లు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. బాలీవుడ్ న‌టుడు ఇమ్రాన్ హ‌ష్మీ విల‌న్‌గా న‌టించాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహ‌న్ హీరోయిన్‌గా క‌నిపించింది. ఓజీ 2 పేరుతో ఈ మూవీకి సీక్వెల్‌ను మేక‌ర్స్ అనౌన్స్ చేశారు.

Also Read – PRABHAS: ‘స్పిరిట్’లో మెగా ట్విస్ట్! విలన్‌గా పాత బాలీవుడ్ హీరో, తండ్రిగా చిరంజీవి?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad