Pawan Kalyan OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ (ఓజస్ గంభీరా) సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ చిత్రం ప్రీమియర్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా తొలి రోజే రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ రాబట్టింది. కేవలం తొలి నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరి జౌరా అనిపించింది. తాజాగా, ఈ మూవీ రూ.300 కోట్ల క్లబ్‌లో చేరినట్లు డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. అయితే కలెక్షన్ పోస్టర్ రిలీజ్ చేయకపోవడంతో, ఎంత గ్రాస్ వచ్చిందనేది క్లారిటీ రాలేదు. అయితే, సోమవారం వసూళ్ల వివరాలను తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 308 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు పేర్కొన్నారు . పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి సినిమాగా రికార్డుకెక్కింది. భారీ వసూళ్లు రాబట్టి దసరా విజేతగా నిలిచింది. కాగా, ‘ఓజీ’ 2025లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచిందని చిత్ర బృందం ప్రకటించింది.
No rules.⁰No laws.⁰Only Gambheera’s law.
And he’s the ORIGINAL GANGSTER 🔥#TheyCallHimOG 11 Days Worldwide Gross 308 Cr+ 💥
⁰The Highest Grossing Telugu Film of 2025 ❤️🔥#OG #BoxOfficeDestructorOG pic.twitter.com/gJvhKdtrf0— DVV Entertainment (@DVVMovies) October 6, 2025
హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన తొలి సినిమా..
అయితే, సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ఆయన సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది. ఈ మూవీతో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. డీవీవీ దానయ్య నిర్మించారు. అయితే, ఓజీ సినిమాకి రిలీజ్ కి ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీపై పవన్ కళ్యాణ్ గత చిత్రం హరి హర వీరమల్లు ప్రభావం ఉంటుందనుకున్నారు. కానీ, అసలు ఆ సినిమా ప్రభావ ఛాయలు కూడా పడలేదు. ఏపీ, తెలంగాణలలో ప్రత్యేకంగా ప్రదర్శించిన ప్రీమియర్స్, బెనిఫిట్ షోస్ తో కంప్లీట్ పాజిటివ్ టాక్ రావడంతోనే ఓజీ సక్సెస్ స్కేల్ ని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. గ్యారెంటీగా గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి, తొలిప్రేమ, గబ్బర్ సింగ్ సినిమాలు సృష్ఠించిన ఇండస్ట్రీ హిట్ ని ఓజీ కూడా సృష్ఠిస్తుందని చెప్పుకున్నారు. అలాగే, సుజీత్ కూడా హైప్‌ని క్రియేట్ చేశాడు. 11 రోజులు ముగిసే సరికి ఓజీ రూ.300 కోట్ల మార్క్ ని దాటేసింది. అయితే, ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడానికి పవన్ మేనియా ప్రధాన కారణం అయితే, దర్శకుడు సుజీత్ టేకింగ్.. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఓజీ సక్సెస్‌లో ముఖ్య భాగమయ్యాయి. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో పెరిగాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ లో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా, ఈ ఏడాది రూ. 300 కోట్ల క్లబ్‌లోకి చేరిన సినిమాలు చాలా అరుదు. విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.303 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. నిన్నటి వరకూ హయ్యెస్ట్ గ్రాస్ రాబట్టిన తెలుగు సినిమా ఇదే. కానీ ఇప్పుడు రూ.308 కోట్లకు పైగా వసూళ్లతో ఓజీ ఆ రికార్డును బ్రేక్ చేసి, టాప్ లో నిలిచింది.


