Friday, May 30, 2025
Homeచిత్ర ప్రభOG: ముంబైలో OG షూటింగ్.. పవన్ కళ్యాణ్ వీడియో లీక్..!

OG: ముంబైలో OG షూటింగ్.. పవన్ కళ్యాణ్ వీడియో లీక్..!

పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా చాలా రోజులుగా సినిమాలకి బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన నిర్మాతలకు ఇచ్చిన హామీ ప్రకారం, వచ్చే ఏడాది లోపు చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తిచేసేందుకు జెట్ స్పీడ్ లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో “హరిహర వీరమల్లు” షూటింగ్‌ను పూర్తిచేసి జూన్ 12న విడుదలకు సిద్ధం చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎక్కువ హైప్ సొంతం చేసుకున్న సినిమా OG షూటింగ్ లో కూడా బిజీగా ఉన్నారు.

- Advertisement -

ఈ సినిమా “DVV ఎంటర్టైన్మెంట్” బ్యానర్ పై, “సాహో” ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతుంది. ముంబై నేపథ్యంలో రూపొందుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా మొదటి గ్లింప్స్‌తోనే ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడినట్టు కనిపిస్తోంది. ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక పవన్ ఎక్కడ కనిపించినా ఓజీ అంటూ హంగామా చేస్తారు. సినిమాకి పవన్ ఇంకా 20 రోజుల డేట్స్ ఇస్తే షూటింగ్ పూర్తవుతుందని సమాచారం.

తాజాగా పవన్ మళ్లీ OG సినిమా కోసం డేట్స్ కేటాయించారు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జోరుగా సాగుతుంది. ఈలోగా పవన్ షూటింగ్ బ్రేక్ సమయంలో బయటకు రావడం, కార్ ఎక్కుతుండగా ఆయన లుక్ క్యామరాల్లో బంధించబడింది. బెల్‌బాటమ్ ప్యాంట్, షర్ట్ టక్ చేస్తూ పవన్ కనిపించిన ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. OG మాస్ లుక్‌లో పవన్ కనిపించడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.

ఇలా చూస్తే షూటింగ్ వేగంగా పూర్తవడంతో OG సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్యాన్స్ ఆ తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News